Friday, December 9, 2022
Friday, December 9, 2022

టీకాతో బాహుబలులయ్యారు : ప్రధాని మోదీ


కొవిడ్‌ నిబంధనల నడుమ సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని కొవిడ్‌ టీకా ప్రాముఖ్యతను వివరించారు. ‘మీరంతా కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకుని ఉంటారని ఆశిస్తున్నాను. దీంతో దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది ప్రజలు బాహుబలులుగా మారారు.’ అని అన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నియమావళిని పాటించాలని సూచించారు. పార్లమెంట్‌ సమావేశాలు ఫలవంతంగా సాగాలని, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు లభించాలని ఆశిస్తున్నాను..అందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కొవిడ్‌ 19 కట్టడి చర్యలపై ఇటీవల అన్ని రాష్ట్రాల సీఎంతో తాను చర్చించానన్నారు. ప్రపంచం అంతా మహమ్మారితో సతమతం అయ్యిందని, పార్లమెంట్‌లో ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరగాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img