Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

థర్డ్‌వేవ్‌ ప్రారంభంలో ఉన్నాం..


: డబ్ల్యూహెచ్‌ఓ
ప్రస్తుతం ప్రపంచం కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రారంభంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. ఇప్పటి వరకు గుర్తించిన ‘ఆందోళన రకం’ వైరస్‌లలో డెల్టా వ్యాప్తి వేగం అత్యధికమని తెలిపింది.ఈ నెల 13 నాటికి కనీసం 111 దేశాల్లో డెల్టా ఉనికి ఉందని, రాబోయే నెలల్లో ఇది మరింతగా విస్తరించనుందని హెచ్చరించింది. వైరస్‌లో పలు మార్పులు వస్తుండటంతో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అథానమ్‌ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ ప్రస్తుతం ప్రపంచం కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రారంభంలో ఉందని హెచ్చరించారు. ప్రజారోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టకపోవడం, ఆంక్షలు ఎత్తివేస్తుండటంతో కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. వ్యాక్సినేషన్‌ కారణంగా ఐరోపాలో కరోనా కేసులు తగ్గాయని, ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img