Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

దేశంలో కొత్తగా 38,164 కరోనా కేసులు


దేశంలో గత 24గంటల వ్యవధిలో కొత్తగా 38,164 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా బారినపడి నిన్న 499 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,11,44,229 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,14,108కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి 38,660 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,03,08,456 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 4,21,665 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశంలో 40కోట్ల మందికిపైగా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. వ్యాక్సినేషన్‌ ప్రారంభం నాటినుంచి సోమవారం ఉదయం వరకూ దేశవ్యాప్తంగా 40,64,81,493 డోసులను పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img