Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

కొత్తగా 27,176 పాజిటివ్‌ కేసులు
దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 27,176 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,16,755కు చేరింది. ఇందులో 3,51,087 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వైరస్‌ బారి నుంచి 3,25,22,171 కోలుకున్నారు. మరో 4,43,497 మంది బాధితులు మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో 38,012 మంది కోలుకోగా, 284 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 61,15,690 మందికి కరోనా వ్యాక్సినేషన్‌ చేశామని వెల్లడిరచింది. దీంతో మొత్తం 75,89,12,277 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img