test
Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

నా ఫోన్ గ్యాల‌రీ మొత్తం నా కూతురి ఫొటోలే.. కోహ్లీ

త‌మ ముద్దుల కుమారై వామిక గురించి ఎప్పుడూ మాట్లాడని టీమిండియా సూప‌ర్ స్టార్ విరాట్ కోహ్లీ తొలిసారి త‌న కూతురి గురించి మాట్లాడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫోన్ కుమార్తె వామిక ఫొటోలతో నిండిపోయిందని చెప్పాడు. ఆర్‌సీబీ బోల్డ్ డైరీస్్ణతో చాట్ చేస్తున్న సమయంలో కోహ్లీ ఈ విషయం వెల్లడించాడు. తన ఫోన్ గ్యాలరీ మొత్తం వామిక చిత్రాలే ఉన్నాయన్నాడు. వామిక ఫొటోలు చాలా తీశాను. వామిక, త‌న భార్య అనుష్కతో పాటు మా ఇంట్లోని పెట్ (కుక్క) ఫొటోలు కూడా తీశాను అని కోహ్లీ తెలిపాడు. చాన్నాళ్లు ప్రేమించుకొని పెళ్లి బంధంతో ఒక్కటైన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు 2021 లో వామిక జన్మించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img