Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

పండోరా ప్రకంపనలు

పన్ను ఎగవేతలు, విదేశాల్లో సంపన్నుల ఆస్తులపై ఐసీఐజే నివేదిక
91 దేశాల బడాబాబుల పేర్లు బట్టబయలు
జాబితాలో అంబానీ, టెండూల్కర్‌ సహా 330 మంది భారతీయులు..

న్యూదిల్లీ : ప్రముఖులుగా చలామణి అవుతోన్న దేశాధ్య క్షులు, మాజీ దేశాధినేతలు, ప్రధానులు, మాజీ ప్రధానులు, మంత్రులు, రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు, దౌత్యవేత్తలు, కుబేరులు, అంతర్జాతీయ ప్రముఖుల అవినీతి బండారం మరోసారి బయట పడిరది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల బాగోతాలను ఒక్కటొక్కటిగా బయటపెట్టి సంచలనం సృష్టించింది ‘పండోరా పేపర్స్‌ లీకేజి’. ఐదేళ్ల కిందట పనామా పేపర్ల లీకేజి తరహాలోనే ఇప్పుడు పండోరా రచ్చ మొదలైంది. ‘పండోరా పేపర్స్‌’ పేరుతో ప్రముఖుల ఆస్తులు, ఆర్థిక లావాదేవీల రహస్య పత్రాలను ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌ (ఐసీఐజే) బహిర్గతం చేసింది. ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద లీక్‌ కాగా జాబితాలో 91 దేశాల సంపన్నులు, ప్రముఖులు, రాజకీయ నేతలు ఉన్నారు. ఈ జాబితాలో 330 మందికిపైగా భారతీయులు ఉన్నారు. అనిల్‌ అంబానీ, వినోద్‌ అదానీ, జాకీ ష్రాఫ్ర్‌, కిరణ్‌ మజుందార్‌షా, నీరా రాడియా, సచిన్‌ టెండూల్కర్‌, సతీశ్‌ శర్మ వంటి పెద్దపెద్ద పేర్లు ఉన్నాయి. పండోరా పేపర్స్‌ ద్వారా బట్టబయలు అయిన పన్ను ఎగవేతదారుల విషయంలో అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని హక్కుల సంఘం ఆక్స్‌ఫామ్‌ ఇండియా కోరింది. పన్నుల ఎగవేత/ తక్కువ పన్నుల కారణంగా ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు 427 బిలిబియన్‌ డాలర్లు చొప్పున ఏటా నష్టమొస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రభావం తీవ్రంగా ఉంది. కార్పొరేషన్లు, సంపన్నులు ట్యాక్స్‌ హెవెన్స్‌ను మరెవ్వరూ వినియోగించనంతగా వాడేస్తు న్నారు. తద్వారా నేరాలు, అవినీతి పేట్రేగిపోతున్నట్లు ఆక్స్‌ఫామ్‌ ఇండియా సీఈవో అమితాబ్‌ బెహర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ‘టాక్స్‌ హెవెన్స్‌’కు అంతం పలికితే ప్రజా వ్యయానికి అవసరమైన ఆదాయం పన్ను రూపేణ ప్రభు త్వాలకు వస్తుందన్నారు. పండోరా వెల్లడిరచిన పేర్లలో గొప్ప గొప్పోళ్లు ఉంటే వీరంతా తామే తప్పు చేయలేదని అమయాకత్వం ప్రదర్శించారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడలేదని పేర్కొన్నారు. కిరణ్‌ మజుందార్‌ షా సోమ వారం స్పందిస్తూ తన భర్త ట్రస్టు చట్టబద్ధమైనదేనని తెలి పారు. పన్నుల బెడద లేని దేశాలైన పనామా, దుబాయ్‌, మొనాకో, కేమన్‌ ఐలాండ్స్‌ మొదలగు వాటిలో నల్లధనాన్ని సంపన్నులు దాచుకోవడంతో పాటు ఆస్తులను సమకూర్చుకోవటానికి డొల్ల కంపెనీలను సృష్టించారని, వాటికి సంబంధించిన రూ.1.2 కోట్ల పత్రాలను సేకరించామని ఐసీఐజే ప్రకటించింది. అమెరికా, భారత్‌, పాకిస్థాన్‌, బ్రిటన్‌, మెక్సికో తదితర దేశాల సంపన్నులు, రాజకీయ నేతలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపింది. 117 దేశాల్లో 150 మీడియా సంస్థలకు చెందిన 600 మంది జర్నలిస్టుల ద్వారా పండోరా పేపర్స్‌ వెలుగు చూసినట్లు ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌ (ఐసీఐజే) వెల్లడిరచింది. ఐసీఐజే పరిధిలోని మీడియాలో భారత్‌లో ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉంది. దీని నివేదికల ప్రకారం 330 మందికిపైగా ప్రస్తుత, మాజీ రాజకీయ నేతలు రహస్య లావాదేవీలు బహిర్గతం అయ్యాయి. ఆఫ్‌ షోర్‌ టాక్స్‌ హెవెన్స్‌లో 14 కంపెనీలకు చెందిన 12 మిలి యన్‌ పత్రాలను భారత్‌కు చెందిన వార్తాసంస్థ సేకరిం చింది. భారతీయ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌, పాప్‌ మ్యూజిక్‌ దీవా షకీరా, సూపర్‌మోడల్‌ క్లౌడియా స్కిఫర్‌, ఇటాలియన్‌ మాబ్‌స్టర్‌ ‘లెల్‌ ది ఫాట్‌ వన్‌’ ఉన్నట్లు ఐసీఐజే నివేదిక పేర్కొంది. పండోరా పేపర్స్‌లో టెండూ ల్కర్‌తో పాటు ఆయన భార్య అంజలి, మామయ్య ఆనంద్‌ మెహతా పేర్లు ఉన్నాయి. సచిన్‌ కుటుంబం.. బ్రిటిష్‌ వర్జిన్‌ దీవులలోని సాస్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌లో లాభాల కార్యాలయాన్ని నిర్వహిస్తున్నట్లగా తెలుస్తోంది. పండోరా జాబితాలో భారత్‌ ఆరవ స్థానంలో పాకిస్థాన్‌ ఏడవ స్థానంలో ఉంది. ఐసీఐజే ప్రకారం జోర్డాన్‌ రాజు అబ్దుల్లా 2, బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లయిల్‌, చెక్‌ రిపబ్లిక్‌ ప్రధాని ఆండ్రెజ్‌ బాబిస్‌, కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యట్టా, ఈక్వెడార్‌ అధ్యక్షుడు గ్యుల్లెర్మో లస్సో, పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రహస్య ఆర్థిక కార్యకలాపాలు జరిపినట్లు తెలుస్తోంది. టర్కీ నిర్మాణ రంగ దిగ్గజం ఎర్మన్‌ ఇలికాక్‌, రెనాల్డ్స్‌ అండ్‌ రెనాల్డ్స్‌ స్టాఫ్ట్‌వేర్‌ మాజీ సీఈవో రాబర్ట్‌ టి బ్రాక్‌ మెన్‌ పేర్లు కూడా నివేదికలో ఉన్నాయి రష్యాకు చెందిన 130 మందికిపైగా బిలియనీర్లు, అమెరికా, టర్కీ, ఇతర దేశాల సంపన్నుల పేర్లున్నాయి. తాజా డేటాలీక్‌ మేల్కొ లుపు కావాలని యూరోపియన్‌ పార్లమెంటులో గ్రీన్‌ పార్టీ శాసనసభ్యుడు స్వెన్‌ గీగోల్డ్‌ అభిప్రాయపడ్డారు. అంతర్జా తీయ స్థాయిలో పన్ను ఎగవేతలు అంతర్జాతీయ అసమాన తకు దారితీస్తుందని హెచ్చరించారు. ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేష నల్‌ కూడా పండోరా పేపర్స్‌ విడుదలను స్వాగతించింది. కోవిడ్‌ నేపథ్యంలో మెరుగైన ఉద్యోగావకాశాల కల్పనకు, నూతన ఆవిష్కరణలకు, వాతావరణ మార్పులకు డబ్బు లేదని ఏ రాజకీయ నేత, బిజినెస్‌ లీడర్‌ చెబితేగనుక ఏ విధంగా నిలదీయాలో మనకు పండోరా పేపర్స్‌ చెబుతున్నాయని పేర్కొంది. కాగా, పనామా పేపర్ల కొనసాగింపుగా పండోరా పేపర్స్‌ ఉన్నాయి. 2016లో బహిర్గతమైన పనామా పేపర్ల కంటే మరింత ప్రభావం తంగా పరిణమిస్తున్నాయి. అధిక సమాచారంతో సంచల నం సృష్టించాయి. మూడు టెరాబైట్ల డేటా, 7,60,000 ఫొటోలను బట్టబయలు చేశాయి. 1970 నుంచి 1996 2020 వరకు 38 వేర్వేరు ప్రపంచ దేశాల అధికార పరిధిల్లో 14 వేర్వేరు సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి లీక్‌ అయిన డేటా ఇందులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 150 మీడియా సంస్థల అధ్యయనంతో పండోరా పేపర్స్‌ బయటకు రాగా వీటిలో 64 లక్షల పత్రాలు, 10 లక్షలకుపైగా ఈ మెయిల్స్‌, ఐదు లక్షలకు మించి స్ప్రెడ్‌షీట్లు ఉన్నాయి. ఇదిలావుంటే, బ్రిటిష్‌ వర్జిన్‌ ఐల్లాండ్స్‌, హాంగ్‌కాంగ్‌, బిలేజ్‌ సహా పన్ను ఎగవేత స్వర్గదామాల ఖాతాలపై ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టులు ఆరా తీశారు. అమెరికాతో పాటు దక్షిణ దకోటాలో 81, ఫ్లోరిడాలో 37 ట్రస్టుల్లో ఉన్న రహస్య ఖాతాలనూ వెలుగులోకి తెచ్చారు. సంపన్నుల తమ సంపదను రహస్యంగా విదేశాలకు ఎలా మళ్లిస్తారు.. దానిని ఏ విధంగా దాస్తారో వివరించారు.
పాక్‌ చిట్టా..
పాకిస్థాన్‌కు చెందిన అనేక మంది మంత్రులు, రిటైర్డ్‌ అధికారులు, సైన్యాధికారులు, వ్యాపారవేత్తల పేర్లు పండోరా పేపర్స్‌లో దర్శనమిచ్చాయి. పాకిస్థాన్‌ ఆర్థిక మంత్రి షౌకత్‌ తరీన్‌, మంత్రి మూనిస్‌ ఇలాహీ, సెనేటర్‌ ఫైసల్‌ వావ్డా, పారిశ్రామిక శాఖ మంత్రి ఖుష్రో బక్తియార్‌ తదితరులకు ఆఫ్‌షోర్‌ కంపెనీలతో సంబంధాలు ఉన్నట్లు ఐసీఐజే పేర్కొంది. అదే విధంగా లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) ముహమ్మద్‌ అఫ్జల్‌ ముజఫర్‌ తనయుడుÑ మేజర్‌ జనరల్‌ (రిటైర్డ్‌) నుస్రత్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) ఖాలిద్‌ మక్బూల్‌ అల్లుడు, లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) తన్వీర్‌ తాహిర్‌ భార్య, లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) అలీకులీ ఖాన్‌ సోదరి, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అబ్బాస్‌ ఖత్తాక్‌ తన యులు, ఆర్మీ మాజీ అధికారి, రాజకీయవేత్త రజానాదిర్‌ పర్వేజ్‌ల వివరాలు జాబితాలో ఉన్నాయి. అలాగే కొన్ని మీడియా సంస్థల యజమానులకూ డొల్ల కంపెనీలు ఉన్నట్లు పండోరా పేపర్స్‌ వెల్లడిరచాయి. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) ప్రాంచైజ్‌ పెషావర్‌ జల్మీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త జావేద్‌ అఫ్రిదీలకు మూడు షెల్‌ కంపెనీలు బీవీఐ అధికార పరిధిలో ఉన్నట్లు పేర్కొన్నాయి. ప్రముఖుల ఆస్తుల చిట్టా విప్పిన పండోరా పేపర్స్‌ లీకేజిని ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ స్వాగతించారు. ఈ జాబితాలో పేర్లు ఉన్న ప్రతి ఒక్కరిపై తమ ప్రభుత్వం దర్యాప్తు జరుపుతుందన్నారు. తప్పు జరిగినట్లు రుజువు అయితే ఉపేక్షించేది లేదని చెప్పారు. వాతావరణ మార్పు సంక్షోభం తరహాలోనే తీవ్రమైనదిగా దీనిని పరిగణించా లని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. నాడు ఈస్ట్‌ ఇండియా కంపెనీ భారత సంపదను కొల్లగొట్టినట్లు గానే నేడు సంపన్నులు దేశాలను దోచేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిని అరికట్టేందుకు సంపన్న రాజ్యాలు ఆసక్తి కనబర్చకపోవడం దురదృష్టకరమని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. అయితే పండోరా పేపర్స్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌, ఆయన కుటుంబం వివరాలు ఉండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img