Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రజాస్వామ్యం ఖూనీ సహించం

. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
. కొత్త మేయర్‌ విధులు నిర్వహించరాదు
. బ్యాలెట్‌పత్రాలు, వీడియో భద్రపర్చాలని హైకోర్టుకు ఆదేశం
. 12న తదుపరి విచారణ

న్యూదిల్లీ: అత్యంత వివాదాస్పదమైన చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది. ఘాటు విమర్శలు చేసింది. అదే తీవ్రతతో కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త మేయర్‌ సారథ్యంలో ఎలాంటి సమావేశాలను కూడా నిర్వహించకూడదని ఆదేశాలను జారీ చేసింది. మేయర్‌ ఎన్నికలను నిర్వహించిన రిటర్నింగ్‌ అధికారిపై సుప్రీంకోర్టు మండిపడిరది. రిటర్నింగ్‌ అధికారి బ్యాలెట్‌ పత్రాలను తారుమారు చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. ‘ఎన్నికల నిర్వహణ తీరు ఇదేనా? ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇది ప్రజాస్వామ్యం హత్యే. ఆయనపై విచారణ జరపాలి’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటీవలే చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ సీనియర్‌ నేత మనోజ్‌ సోంకర్‌ చండీగఢ్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ- కాంగ్రెస్‌ ఉమ్మడి అభ్యర్థి కుల్‌దీప్‌ సింగ్‌ను నాలుగు ఓట్ల తేడాతో ఓడిరచారు. చండీగఢ్‌ మున్సి పల్‌ కార్పొరేషన్‌లో ఉన్న మొత్తం సంఖ్యాబలం 35. కౌన్సిలర్లుగా ఎన్నికైన వారిలో బీజేపీ-14, ఆమ్‌ ఆద్మీ పార్టీ-13, కాంగ్రెస్‌-7, శిరోమణి అకాలీదళ్‌కు ఒక సభ్యుడు ఉన్నారు. మేయర్‌ ఎన్నికలో బీజేపీ నుంచి మనోజ్‌ సోంకర్‌, ప్రతిపక్షాల కూటమి (ఇండియా) అభ్యర్థిగా కుల్‌దీప్‌ సింగ్‌ పోటీ చేశారు. నిజానికి ఈ ఎన్నికలో సంఖ్యాపరంగా చూసుకుంటే ఆప్‌- కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించాల్సి ఉంది. అలా జరగలేదు. పోలింగ్‌ సమయంలో బీజేపీ అభ్యర్థికి 16 ఓట్లు రాగా… కుల్‌దీప్‌ సింగ్‌కు 12 ఓట్లు పోల్‌ అయ్యాయి. కాంగ్రెస్‌-ఆప్‌కు చెందిన ఎనిమిది ఓట్లను రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ మసీ… చెల్లనివిగా ప్రకటించారు. దీంతో 16 ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలిచారు. ఈ ఎన్నిక వ్యవహారంపై ఆప్‌- కాంగ్రెస్‌ కూటమి తొలుత పంజాబ్‌హరియాణా హైకోర్టును ఆశ్రయించగా... బీజేపీ గెలుపుపై స్టే విధించేం దుకు నిరాకరించింది. ప్రిసైడిరగ్‌ అధికారిగా వ్యవహరించిన అనిల్‌ మసీప్‌ాను మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఆప్‌కాంగ్రెస్‌ కూటమి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. మేయర్‌ ఎన్నికలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిపింది. తమకు ఉన్న సంఖ్యాబలం గురించి వివరించింది. ప్రత్యేకించి- తమ కూటమికి చెందిన కౌన్సిలర్లు వేసిన ఎనిమిది ఓట్లను చెల్లనివిగా ప్రకటించడం సరికాదని, దీనిపై విచారణ జరిపించాలని కోరింది. ఈ పిటిషన్‌ను సోమవారం విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు…. ఘాటు వ్యాఖ్యలు చేసింది. రిటర్నింగ్‌ అధికారి.. బ్యాలెట్‌ పత్రాలను తారుమారు చేశారని, వాటిని ట్యాంపర్‌ చేశారనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియను రిటర్నింగ్‌ అధికారి అపహాస్యం చేశారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటర్నింగ్‌ అధికారి తీరు ఇదేనా? ఎన్నికలను నిర్వహించేది ఇలాగేనా అంటూ రిటర్నింగ్‌ అధికారిని నిలదీసింది. అతను అన్ని రకాలుగా శిక్షార్హుడని తేల్చి చెప్పింది. బ్యాలెట్‌ పేపర్లు, వీడియోలతో సహా ఈ ఎన్నిక సంబంధించిన అన్ని రికార్డులనూ భద్రపర్చాలని, వాటన్నింటినీ పంజాబ్‌ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు అందజేయాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలను వెలువడిరచేంత వరకూ కొత్త మేయర్‌ మనోజ్‌ సోంకర్‌ సారథ్యంలో ఎలాంటి సమావేశాలు గానీ, భేటీలను గానీ నిర్వహించకూడదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఆయన ఎలాంటి అధికారిక భేటీలను నిర్వహించకూడదని తెలిపింది. ‘ప్రిసైడిరగ్‌ అధికారి ప్రవర్తనను చూసి మేం ఆందోళన చెందుతున్నాం. ఆయన కెమెరాను చూసి ఎందుకు భయపడి పారిపోతున్నారు? ఆయన బ్యాలెట్‌ పేపర్లను మార్చుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఆయన్ను గమనిస్తోందని ఆ అధికారికి చెప్పండి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల బ్యాలెట్‌ పేపర్లు, వీడియోగ్రఫీని సాయంత్రం 5గంటల లోపు భద్రపరచాలని పంజాబ్‌, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. చండీగఢ్‌ కార్పొరేషన్‌ తదుపరి సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని పేర్కొంది. పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img