Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ప్రజాస్వామ్యానికి మోదీ ముప్పు

. లౌకికవాదం పరిరక్షణే ‘ఇండియా’ లక్ష్యం
. ఎన్నికల కమిషన్‌ వైఫల్యంపై సుప్రీంకోర్టుకు…
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర-తిరుపతి: ‘ప్రజాస్వామ్యానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాదకరం. జవహర్‌లాల్‌ నెహ్రూ మొదలుకొని…మన్మోహన్‌ సింగ్‌ వరకు ఎంతో మంది ప్రధానులను భారత ప్రజలు చూశారు. బీజేపీ నుంచి అటల్‌ బిహారీ వాజ్‌పేయి కూడా ప్రధాని గా పనిచేశారు. అయితే నరేంద్రమోదీ వంటి ప్రమాదకర ప్రధానిని ఎప్పుడూ చూడలేదు. ప్రధాని పదవి కోసం మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతు న్నారు. 2047 వరకు తానే ప్రధాని అంటున్నారు. మోదీ విధానాలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిరది. అందుకే లౌకికవాదాన్ని కాపాడుకోవడా నికి ‘ఇండియా’ కూటమి ఏర్పడిరది. ప్రజాస్వామ్యం కాపాడటమే ‘ఇండియా’ కూటమి లక్ష్యం. ఏపీలో ఎన్నికల కమిషన్‌ వైఫల్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశా. ఆ పిటిషన్‌ విచారణకు వస్తుందని ఆశిస్తున్నా’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. తిరుపతి నగరం బైరాగపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో నరేంద్రమోదీలా దిగజారి మాట్లాడిన ప్రధాని దేశచరిత్రలో ఎవరూ లేరని రామకృష్ణ విమర్శించారు. ఓట్ల కోసం మతాన్ని రెచ్చ గొట్టే పద్ధతిలో ఎవరూ మాట్లాడలేదన్నారు. మోదీ తనను తాను దైవాంశ సంభూతుడిగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. దేవుడు తనను పంపాడని, 2047 వరకు తానే ప్రధానిగా ఉంటానని మోదీ పరోక్షంగా బీజేపీ నేతలను హెచ్చరిస్తున్నాడన్నారు. మోదీ ప్రధానిగా పదేళ్ల కాలంలో ఒక్క మంచి పనైనా చేశారా అని రామకృష్ణ ప్రశ్నించారు. మోదీ పాలనలో భారతదేశం అన్ని రంగాల్లో వెనక్కు పోయినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయన్నారు. 2014 నాటికి భారతదేశం అప్పు రూ.55 లక్షల కోట్లు అయితే… మోదీ ప్రధాని అయ్యాక పదేళ్లలో ఈ అప్పు రూ.205 లక్షల కోట్లకు చేరిందన్నారు. మోదీ ప్రధాని కాక మునుపు లీటరు పెట్రోలు ధర రూ.73 ఉండగా… నేడు రూ.110కి చేరిందన్నారు. నాడు వంట గ్యాస్‌ ధర రూ.415 ఉండగా… నేడు రూ.1,160కి చేరిందన్నారు. ధరల నియంత్రణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రామకృష్ణ చెప్పారు. మోదీ విధానాలతో 42 శాతం మంది పట్టభద్రులు నిరుద్యోగులుగా మిగిలిపోయారన్నారు. ఏడాదికి పైగా రైతులు పోరాటం చేసినా మోదీ ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించలేదన్నారు. విదేశాల నుంచి వెనక్కి తీసుకొస్తానన్న నల్లధనం అంశాన్ని మర్చిపోయారన్నారు. బ్యాంకులకు రూ.10 లక్షల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన బడాబాబులపై చర్యలు లేవన్నారు. అందులో ఎక్కువమంది గుజరాతీయులేనని చెప్పారు. ఈ విషయాలు ప్రస్తావించకుండా కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే మతం కార్డును మోదీ ప్రయోగిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. యూపీలో కాంగ్రెస్‌, సమాజ్‌ వాదీ పార్టీ గెలిస్తే రామాలయం మూసేస్తారని, హిందువుల ఆస్తులు ముస్లింలకు పంచి పెడతారంటూ మోదీ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2047 వరకు మోదీ ప్రధానిగా ఉంటే భారతదేశం ఉంటుందా అని రామకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో 300 చర్చిలు ధ్వంసం చేశారని, వంద మందికి పైగా క్రైస్తవులను చంపేశారన్నారు. వందల మంది మహిళలపై అత్యాచారాలు జరిగినా మోదీ ఆ రాష్ట్రాన్ని సందర్శించకపోవడం బాధాకరమన్నారు.
చంద్రబాబు, జగన్‌, పవన్‌ కల్యాణ్‌ దేశహితం కోసం… సమైక్యత కోసం ఎన్డీయే విషయంలో ఆలోచించాలని రామకృష్ణ సూచించారు. భయంతోనే ఆ ముగ్గురూ మోదీకి మద్దతు ఇస్తున్నారని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. మోదీని వ్యతిరేకించే నేతలను జైలుకు పంపడం ఇందుకు కారణమన్నారు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను చేతిలో పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారన్నారు. ఇందుకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉదాహరణని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో మోదీని ఓడిరచకపోతే భారతదేశం ప్రమాదంలో పడుతుందని రామకృష్ణ హెచ్చరించారు. ఉత్తర భారతదేశంలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నందునే మోదీ మరింత రెచ్చిపోయి మత విద్వేషాలు పెంచుతున్నారన్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన లౌకిక పార్టీలని… ఇవి బీజేపికి మద్దతు ఇవ్వకూడదని ఆయన కోరారు. ఏపీ విషయానికి వస్తే ఐదేళ్ల పాలనలో జగన్‌మోహన్‌రెడ్డి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని రామకృష్ణ విమర్శించారు. అందుకే కొంతమంది పోలీసు అధికారులను ఈసీ బదిలీ చేయాల్సి వచ్చిందన్నారు. పోలీసు వైఫల్యానికి తిరుపతి ఘటన ఓ ఉదాహరణ మాత్రమేనన్నారు. తిరుపతిలో స్ట్రాంగ్‌ రూముల వద్దే చంద్రగిరి కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం చేయడం పోలీసు వైఫల్యానికి నిదర్శనమన్నారు. తిరుపతిలో మీడియా, ఫొటోగ్రాఫర్లపై దాడి చేయడం దారుణమన్నారు. మాచర్ల ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు పెడితే పది రోజుల పాటు పోలీసులు పట్టుకోలేదన్నారు. ఆంధ్రజ్యోతి అసిస్టెంటు ఎడిటర్‌ ఆర్‌ఎం ఉమామహేశ్వరరావుపై తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్‌ రెడ్డి చేసిన ఆరోపణలు మంచివి కాదన్నారు. ఏపీలో ఎన్నికల కమిషన్‌ పూర్తిగా విఫలమైందన్నారు. ఈసీ వైఫల్యంపై తాను సుప్రీంకోర్టులో పిటిషను దాఖలు చేశానని, అది నేడో రేపో విచారణకు వచ్చే అవకాశం ఉందన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, శివారెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు జనార్ధన్‌, జిల్లా కార్యదర్శి పి.మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, నగర కార్యదర్శి విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img