Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రత్యామ్నాయరాజకీయ శక్తిగా సీపీఐ

లెనిన్‌ శత వర్ధంతిని జయప్రదం చేయండి: రామకృష్ణ పిలుపు

విశాలాంధ్ర – విజయవాడ : భారత కమ్యూనిస్టు పార్టీ 99వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకొని శత వార్షికోత్సవాలకు సమాయత్తమవుతున్న వేళ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విశాలాంధ్ర ప్రధాన కార్యాలయం నుంచి జూమ్‌ పద్ధతిలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జనవరి చివరి నాటికి సభ్యత్వ నమోదు పూర్తి చేయాలన్నారు. ఎక్కువ మందిని పార్టీలోకి ఆహ్వానించాలని సూచించారు. పార్టీలోని అన్ని శాఖలు విస్తృతంగా పనిచేయాలన్నారు. సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని దిశానిర్ధేశం చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు ప్రజలను చైతన్యవంతం చేయటం కోసం ఎక్కువమందిని విశాలాంధ్ర పత్రిక చందాదారులుగా చేర్పించాలని సూచించారు. సోషలిజం సాధకుడు వీఐ లెనిన్‌ శత వర్ధంతి కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించాలని, అందుకోసం ప్రణాళిక రూపొందించుకొని విజయవంతం చేయాలన్నారు. వివిధ జిల్లాల్లో పార్టీ పనితీరును సమీక్షించారు. జిల్లా నాయకత్వం నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ప్రతి నాయకుడు, కార్యకర్త ముందుండి పని చేయాలన్నారు. కేంద్రంలో మతోన్మాద బీజేపీ, రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వాలను గద్దె దించి లౌకికతత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సి అవసరం ఉందన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కమ్యూనిస్టు పార్టీ నిలుస్తుందన్నారు. రామకృష్ణతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథరెడ్డి, అక్కినేని వనజ, సీనియర్‌ నాయకుడు వై.చెంచయ్య, కారవర్గ సభ్యుడు కె.శివారెడ్డి ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img