Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రలోభాలకు లొంగొద్దు

. ప్రజా సమస్యలపై పోరాడదాం
. హోదా సాధనకు చంద్రబాబుకు ఇదే అవకాశం
. త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన
.ఎమ్మెల్సీల భేటీలో జగన్‌ దిశానిర్దేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ప్రజా పోరాటాలే లక్ష్యంగా ముందుకెళ్లాలని, ఎక్కడా ప్రలోభాలకు గురికాకూడదని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాల యంలో గురువారం ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యుల(ఎమ్మెల్సీ)తో జగన్‌ భేటీ అయ్యారు. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ… 40 శాతం మంది ప్రజలు మనవైపే ఉన్నారన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడిరది. మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు జగన్‌ దిశానిర్దేశం చేశారు. తొలుత రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీలతో కలిసి జగన్‌ పూలమాలలేసి నివాళులర్పించారు. జగన్‌ మాట్లాడుతూ జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు అని, ఈ ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీలకు జగన్‌ మనోధైర్యం కల్పించారు. గత ఐదేళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏకంగా 99 శాతం వాగ్ధానాలు అమలు చేశామని, ఏపీ చరిత్రలో కాని, దేశంలో కాని ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. మేనిఫెస్టోను బైబిల్లా, ఖురాన్‌లా, భగవద్గీతలా ఒక పవిత్ర గ్రంథంలా భావించి అమలు చేశామని చెప్పారు. ప్రజలకు రూ.2.70లక్షల కోట్లు సంక్షేమాన్ని ఎలాంటి లంచాలు, వివక్షా లేకుండా అందించా మని, గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు అమలు చేశామని, విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళాసాధికారిత, సుపరి పాలన విషయంలో ఎప్పుడూ జరగని, చూడని సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఇవన్నీ మనం చేసి, చూపించి ప్రజల మన్ననలను పొందిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లామని, ఎన్నికల్లో ఏమైందో తెలియదని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయని, అదే మాదిరిగా మళ్లీ 2024 నుంచి 2029 వరకు కూడా ఐదేళ్లు ఇట్టే గడుస్తాయని వివరించారు. మనం గుర్తుపెట్టు కోవాల్సిన అంశం ఏమిటంటే, సినిమాలో ప్రస్తుతం ఫస్టాఫ్‌ మాత్రమే అయిందని, గతంలో ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏమాదిరిగా పైకి లేచామో అన్నది మీ అందరికీ తెలిసిందేనని చెప్పారు. ప్రజల్లో మనం చేసిన మంచి ఇవాళ ఉందని, ఇంటింటికీ మనం చేసిన మంచి బతికే ఉందన్నారు. గడపగడపకూ మనం చేసిన మంచి ఇంకా బతికే ఉందని, ఇవన్నీ ఉన్న ప్పుడు మళ్లీ మనం పైకి లేవడం అన్నది కూడా తథ్యమని, కాకపోతే కొంత సమయం పడుతుందని, ఆ సమయం మనం ఇవ్వాలని అన్నారు. రాజకీ యాల్లో అన్నికంటే ముఖ్యమైన అంశం నైతికత, విలువలు, విశ్వసనీ యత అని, ఈ పదాలకు అర్థం తెలుసు కోవడం చాలా అవసరమన్నారు. రాజకీ యాల్లో కష్టాలు వచ్చినప్పుడు విలువలు, విశ్వస నీయతలేని మనిషిగా రాజకీయాలు చేద్దామా లేక ఆ కష్టాలను ఎదుర్కొంటూ, హుందాగా నిలబడుతూ, ముందడు గులు వేసి కష్టపడితే మళ్లీ అధికారంలోకి వస్తామా అన్నది ఆలోచించాలన్నారు. అసెంబ్లీలో మన సంఖ్యా బలం పెద్దగాలేదని, ఆ సభలో మనకు గొంతు విప్పే అవకాశం రాకపోవచ్చు, గొంతు విప్పనివ్వకపోవచ్చు అని, కాని మండలిలో మనకు బలం ఉందని, దీన్ని అందరూ గుర్తుపెట్టు కోవాలని సూచించారు. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరని, మహా అయితే నాలుగు కేసులు పెట్ట గలుగుతారని, అంతకు మించి వాళ్లు ఏంచేయ గలుగుతారు… అని భరోసా ఇచ్చారు. కేంద్రంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేవని, కేంద్రంలో 240 సీట్లకు అధికారపార్టీ పరిమితం కావడం, మరోవైపు రాష్ట్రంలో టీడీపీకి మంచి సంఖ్యరావడం, ఎన్డీయేలో కీలకంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేకహోదాను అడగకపోవడం చంద్రబాబు చేసిన మరో పాపం అని, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా అడక్కపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించబోడని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ముమ్మరం అవుతాయని, ప్రజల్లోనే ఉంటామని, ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేపడదామన్నారు. ఏకంగా 14 నెలలు పాదయాత్ర చేశానని, ఆ వయసు ఇవ్వాళ్టికీ నాకు ఉందని, ఆ సత్తువ నాకు ఈ రోజుకీ ఉందని వివరించారు. ఆ సమయం వచ్చేదాకా ఎమ్మెల్సీలుగా మీ పాత్ర మీరు పోషించాలని సూచించారు. ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, హనుమంత రావు, కల్పలతారెడ్డి, వరుదు కళ్యాణి, లేళ్ల అప్పిరెడ్డి, భరత్‌, తోట త్రిమూర్తులు, జయమంగళ వెంకట రమణ, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, నారాయణమూర్తి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img