Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రాజెక్టుల పూర్తిలో విఫలం

. కబ్జాలు చేయడంలో మునిగి తేలుతున్నారు
. పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు పోరు
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు: రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేయడంలో జగన్‌ ప్రభుత్వం విఫలం అయిందనీ, కబ్జాలు చేయడంలో వారు మునిగి తేలుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ప్రాజెక్టులు పరిశీలనలో భాగంగా రెండవ రోజు మంగళవారం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు ఓబులేసు, హరినాధరెడ్డి, ఈశ్వరయ్య, అక్కినేని వనజ, జగదీశ్‌, పి.రామచంద్రయ్య, జంగాల అజయ్‌, రాష్ట్రకార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు, అవులశేఖర్‌, నక్కి లెనిన్‌బాబు, గిడ్డయ్య, రంగనాయుడుతో కలసి ప్రాజెక్టులు పరిశీలించారు. వేదవతి, గుండ్రేవుల, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ వెనుకబడిన కరువు ప్రాంతాలకు తాగునీరు, సాగునీటి కోసం వేదవతి ప్రాజెక్టు కరువు పీడిత ప్రాంతాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రతి ఏడాది 30నుంచి 40టీఎంసీల నీరు వృథాగా పోతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రు.1942కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం నిర్ణయించినా 16కోట్లు మాత్రమే విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. భూసేకరణ చేసి రైతులకు పరిహారం చెల్లించడంలో విఫలం అయిందన్నారు. మలగవెళ్లి వద్ద జలాశయం పనులు ప్రారంభించకుండా ప్రభుత్వం ఏమి చేస్త్తోందని నిలదీశారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుంటే కాంట్రాక్టర్లు పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఓట్లకోసం వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను పాలకులు ముందుకు తేవడం తప్పితే చిత్తశుద్ది లేదన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు సర్వే కోసం 2013నవంబరులో అనుమతులు ఇచ్చి దాదాపు 10సంవత్సరాలు గడిచినా ఒక్క బస్తా సిమెంట్‌ కూడా వేయలేదన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే సుమారు 20టీఎంసీల నీరు నిల్వ ఉంచుకోవచ్చన్నారు. కేసీ కెనాల్‌ ఆయకట్టుకు, కర్నూలు నగరంలో తాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు అయినా ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తిచేయలేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును అధునికీకరణ చేస్తానని చెప్పి నేడు దాని ఊసే ఎత్తడం లేదన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టకపోగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని రామకృష్ణ విమర్శించారు. రాబోయో బడ్జెట్‌లో వేదవతి నదికి 500కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఒత్తిడి పెంచి ప్రాజెక్టులు పూర్తి అయ్యేంత వరకు పోరాటం చేస్తామని రామకృష్ణ తెలిపారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమైన తాగు, సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంలో రాష్ట్రప్రభుత్వం విఫలం అయిందన్నారు. సీపీఐ అధ్వర్యంలో వారం రోజుల పాటు రాష్ట్రంలో పెండిరగ్‌ ప్రాజెక్టులను అన్నింటిని పరిశీలించి చర్చంచి వాటిని ప్రభుత్వం త్వరగా పూర్తి చేసేందుకు ఒక ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నామని చెప్పారు.
వైసీపీ నేతలు కబ్జా చేసిన పొలాల పరిశీలన: జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కబ్జాలు చేయడంలో మునిగి తేలుతోందని వారికి అభివృది ్ద పట్టడం లేదని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రమైన ఆలూరు పట్టణంలో వైసీపీ నేతలు కబ్జా చేసిన పొలాలను సీపీఐ బృందం పరశీలించింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కబ్జాలపై పత్రికలలో వార్తలు రాస్తే వారిపై దాడులు చేస్తామని హెచ్చరించడం, బోరగడ్డ అనిల్‌కుమార్‌ బండికి కట్టుకొని పోతామని బెదిరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని జరుగుతున్నా జగన్‌మోహన్‌రెడ్డి తమాష చూస్తున్నారన్నారు. చెరువు కబ్జాపై కాకుండా అలూరు అభివృద్దిపై దృష్టి మంత్రి మంత్రి గుమ్మనూరు జయరాం దృష్టి సారించాలన్నారు. వేదవతి నది పూర్తి చేస్తే చరిత్రలో నిలిచిపోతావన్నారు. పాత్రికే యులు, పత్రికా యాజమాన్యం జోలికి పోతే భూస్తాపితం అవుతారన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నదని, జీఓ నెం`1 తెచ్చిందని, ప్రతిపక్షాలను మాట్లాడనివ్వడం లేదన్నారు. అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాల సీపీఐ కార్యవర్గ సభ్యులు, వివిధ ప్రజాసంఘాలనాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img