Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బీజేపీతో భారత్‌కు ముప్పు

. రాష్ట్ర ప్రభుత్వాల కూల్చివేతకు కుట్రలు
. ఎమ్మెల్యేల కొనుగోలుకు వందల కోట్లు
. నియంత చేతిలో ఆంధ్రప్రదేశ్‌
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ

విశాలాంధ్రబ్యూరో`కడప: బీజేపీ పాలనలో దేశం అత్యంత ప్రమాదకర పరిస్థితిలో పడిరదని, నియంత పాలనలో ఆంధ్రప్రదేశ్‌ అస్తవ్యస్తంగా మారిందని, ప్రజల మాన, ప్రాణాలను హరిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. దేశ, రాష్ట్ర పరిస్థితులను మార్చాలంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. కడప ప్రెస్‌క్లబ్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసుతో కలిసి రామకృష్ణ శనివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలను మోదీ సర్కారు విచ్ఛిన్నం చేస్తోందని రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రాలను తమ హస్తగతం చేసుకోవడానికి 2016 నుంచి మోదీ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతూ దేశ ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసిందన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో మొదలు పెట్టిన బీజేపీ కుట్రలు… తెలంగాణ వరకు వచ్చాయని, రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ హస్తగతం చేసుకోవాలని కుయుక్తులు పన్నుతోందన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ వేల కోట్ల డబ్బు వెదజల్లుతోందని, కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసే దిశగా పావులు కదుపుతోందని విమర్శించారు. మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి గుజరాత్‌లో రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇస్తామని ఆశ చూపి తన వైపునకు తిప్పుకుందని, అందుకే మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చిందని రామకృష్ణ వివరించారు. దిల్లీ కేంద్రంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బేరసారాలు చేస్తూ బీజేపీ బొక్కబోర్లా పడిరదని చెప్పారు. భారతదేశం ఆకలిచావులతో అల్లాడుతున్నా పట్టని ప్రధాని మోదీ… అదానీ, అంబానీకి లక్షల కోట్లు విలువ చేసే సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు. భారతదేశాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి అనుగుణంగా తీసుకురావాలని మోదీ కుట్రలు పన్నుతున్నారని, వీటిని ప్రజలు దగ్గరగా పరిశీలిస్తున్నారని చెప్పారు.
ప్రత్యేక హోదా ఇవ్వలేదు… ప్రత్యేక ప్యాకేజీ నిధుల ఊసే లేకుండా రాష్ట్రాన్ని నట్టేట ముంచారని మోదీ సర్కారుపై రామకృష్ణ విమర్శలు గుప్పించారు. అయినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రం అడుగులకు మొడుగులొత్తుతున్నారని, జగన్‌కు మోదీ జపం తప్ప మరో ప్రపంచం లేకుండా పోయిందని మండిపడ్డారు. జగన్‌ నాయకత్వంలో రాష్ట్రంలో అరాచక, నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు. భూదందాలు, ఇసుక, మద్యం, మైనింగ్‌ మాఫియాతో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. వైజాగ్‌లో రిషికొండ గుండు గీచారని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధానికి నాడు మద్దతిచ్చిన జగన్‌…నేడు మూడు రాజధానుల పాటపాడటం అతని నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. ఉత్తరాంధ్రలో భూములన్నింటినీ కాజేయడానికి జగన్‌ అండ్‌ కంపెనీ కంకణం కట్టుకున్నదని వెల్లడిరచారు. ఒకే రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు అడ్డంకులు కల్పించడాన్ని హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. రైతుల పాదయాత్రపై పోలీసులు దాడి చేయడం ప్రజా హక్కులను హరించడమేనన్నారు. అమరావతి కోసం ఏ పార్టీతో అయినా కలిసి పోరాటం చేయడానికి సిద్ధమేనని ఓ ప్రశ్నకు ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాయలసీమ అభివృద్ధి కోసం వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేయాలని, యూనివర్సిటీలు, ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు.
ఓబులేసు మాట్లాడుతూ ఒకే దేశం` ఒకే యూనిఫారం అంటూ ప్రధాని నరేంద్రమోదీ చెప్పడం ప్రమాదకర సంకేతాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకెళ్లడమేనని మండిపడ్డారు. ఇలాంటి అనాలోచిత విధానాలపై రాజకీయ పార్టీలన్నీ ఐక్య ఉద్యమానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నియమావళికే ఈసీ వక్రభాష్యం చెబుతోందని, పేదలకు ఉచిత పథకాలు వద్దని చెప్పడం మంచిది కాదన్నారు. దేశంలోని బడాబాబులు రూ.12 లక్షల కోట్లకు పైగా సంపదను కొల్లగొడితే అతీగతీ లేదని, కానీ పేదలకు ఇచ్చే పథకాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. భారతదేశంలో 45 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువున బతుకుతున్నారని, వారి అభ్యున్నతి కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం…నీతిమాలిన చర్యలకు దిగజారడం పద్ధతి కాదన్నారు. కృష్ణపట్నం ఓడరేవు, దామోదర సంజీవయ్య విద్యుత్‌ ప్రాజెక్టును సీఎం జగన్‌ అదానీ చేతుల్లో పెట్టారని విమర్శించారు. సలహాదారుల పేరుతో ప్రజల సొమ్మును అప్పనంగా దోచుకుతింటున్నారన్నారు. ఇకనైనా పెండిరగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రజలకు నీతిమంత పాలన అందించాలని హితవు పలికారు. విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏఐటీయూసీ నాయకులు గుంటి వేణుగోపాల్‌, బాదుల్లా, ఆంజనేయులు, బషీరున్నీసా, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img