London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Monday, October 21, 2024
Monday, October 21, 2024

బ్రాండ్‌ ఏపీ నిలబెడదాం

. ప్రతినెలా 1న పేదల సేవలో…
. మంత్రుల, ఎమ్మెల్యేల మాట వినాలి
. అక్టోబరు 2న విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల
. వినూత్న ఆలోచనతో ముందుకెళ్లాలి
. ప్రభుత్వంపై అసత్య ప్రచారం తిప్పికొట్టాలి
. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: గత ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్ర బ్రాండ్‌ దెబ్బతిందని, మళ్లీ ఏపీ బ్రాండ్‌ నిలబెట్టుకోవాల్సి ఉందని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఐఏఎస్‌ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లాలని, మానవీయ కోణంలో స్పందించాలని కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పేది అధికారులు వినాలని, వారి ఆలోచనలు అమలు చేయాలని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సోమవారం కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు, మంత్రులు నారా లోకేశ్‌, అనగాని సత్యప్రసాద్‌, వివిధ శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. తొలుత సీఎం చంద్రబాబుకు సీఎస్‌ పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించారు. చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తూ, గత ప్రభుత్వ కలెక్టర్ల సదస్సు ద్వారా ప్రజా వేదిక కూల్చి విధ్వంస పాలనకు నాంది పలికారని, నేటి కలెక్టర్ల సదస్సు రాష్ట్ర అభివృద్ధికి నాంది కావాలన్నారు. ప్రతి నెల 1వ తేదీన ‘పేదల సేవలో’ కార్యక్రమంతో అధికారులు ప్రజలతో మమేకమవ్వాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రం కోసం అక్టోబరు 2న విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వంపై చేసే అసత్య ప్రచారాన్ని అధికారులు కూడా తిప్పి కొట్టాలని, అధికారులు, శాఖలు సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా మంచిని చెప్పాలని సూచించారు. జిల్లా స్థాయిలో కూడా విజన్‌ డాక్యుమెంట్‌ సిద్ధం చేసుకోవాలని, 100 రోజుల్లో మార్పు కనిపించాలని కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ నుంచి వెళ్లిన ఐఏఎస్‌ అధికారులు… ఆర్‌బీఐ గవర్నర్లు అయ్యారని, కేంద్రంలో ఉన్నత స్థాయిల్లో ఉన్నారని, ప్రపంచ బ్యాంకుకూ వెళ్లారని చెప్పారు. వ్యవస్థలో ఏదైనా చిన్న తప్పు జరిగితే సరిచేయవచ్చని, మొత్తంగా జరిగిన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే భారీ కసరత్తు చేయాలని, అహర్నిశలు కష్టపడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మనం తీసుకునే నిర్ణయాలు భావితరాలకు ఉపయోగపడాలన్నారు. అధికారులు జవాబువాదారీతనంతో పనిచేయాల్సిన అవసరం ఉందని, కొన్ని కీలక శాఖలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని చెప్పారు. అభివృద్ధితోనే ఆదాయం, ఆదాయం వస్తేనే ప్రజలకు ఖర్చు చేయగలుగుతామని, అభివృద్ధితోనే ప్రజలకు సంతృప్తి ఉంటుందన్నారు. మెరుగైన పాలన అందించడం మా బాధ్యత అని, దానికి మేం కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. పని చేసే అధికారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఉత్తమ కలెక్టర్‌గా ఎదిగే లక్ష్యం దిశగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. మేం గత ఐదేళ్లలో అన్ని విధాల ఇబ్బందులకు గురయ్యామని అన్నారు. నాడు ఎన్నికల హామీలో ప్రజలు గెలవాలని, ఎన్డీఏకు ఓట్లు వేయాలని కోరామని, రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పగా… ప్రజలు మా కూటమికి చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే చాలా సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులున్నాయని వివరించారు. ఐదేళ్లలో ఒక్క కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ పెట్టలేదంటే పరిపాలన ఎలా జరిగిందో మీరు అర్థం చేసుకోవచ్చని సీఎం వ్యాఖ్యానించారు. కలెక్టర్లు, అధికారులు సరికొత్త, వినూత్న ఆలోచనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, సంపద సృష్టించాలన్నారు. మన ప్రభుత్వం సంక్షేమంపై దృష్టిసారిస్తుందని చెప్పారు. ప్రస్తుత పెన్షన్లపై నెలకు రూ.2,730 కోట్లు, ఏడాదికి 33 వేల కోట్లు, ఐదేళ్లకు రూ.1,63,000 కోట్లు ఖర్చు చేయనున్నామని వివరించారు. గత ప్రభుత్వంలో బటన్‌ నొక్కడం తప్ప, ప్రజలను పరామర్శించలేదన్నారు. త్వరలోనే పేదల సేవలో అనే కార్యక్రమం కింద మనం అనుసంధానం అవుదామని చెప్పారు. పేదవారిని చూసినప్పుడు మనసు చలించాలని, ఏం చేస్తే పేదరికం పోతుందో ఆలోచించాలన్నారు. ప్రభుత్వంలో ఎవరూ పెత్తందారీ వ్యవస్థలా ప్రవర్తించకూడదని, అసహ్యంగా మాట్లాడకూడదని సూచించారు. ప్రజాప్రతినిధులు వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకువచ్చినప్పుడు సంబంధిత సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. నాయకత్వం అంటే ఓనర్‌ షిప్‌గా భావించాలని, ప్రతి ఒక్క అధికారి ప్రభుత్వం చేసే కార్యక్రమాలను సొంతం చేసుకోవాలని, సమర్థవంతంగా కలెక్టర్లు పని చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అనంతరం గనులు, ఆర్థిక, ఇసుక, వ్యవసాయ, మత్స్య తదితర శాఖల వారీగా చంద్రబాబు సమీక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img