Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

బ్లూటిక్ కి ఎమౌంట్.. స్టార్స్ కి ట్విట్టర్ షాక్

  • ట్విట్ట‌ర్ ని సొంతం చేసుకున్నాక ఎలాన్ మ‌స్క్ ప‌లు మార్పులు చేర్పులు చేస్తున్నారు. లోగో మార్చ‌డం ద‌గ్గ‌ర నుంచి త‌న ఇష్టం వ‌చ్చిన‌రీతిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. కాగా ఎలాన్ మస్క్ త్వరలో ట్విట్టర్ యూజర్ల నుంచి ఏటా కొంతమొత్తం వసూలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ తరుణంలోనే..తాజాగా బ్లూటిక్‌ ఉన్న వారందరికీ.. బిగ్‌ షాక్ ఇచ్చింది ట్విట్టర్‌ సంస్థ. దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీతారలు ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా మంది అకౌంట్ల బ్లూటిక్‌ ను తొలగించింది. ట్విట్టర్‌. వారు బ్లూటిక్‌ కు కట్టాల్సిన ఛార్జీ చెల్లించకపోవడంతో.. చాలా మంది అకౌంట్ల బ్లూటిక్‌ ను తొలగించింది. ఈ లిస్ట్ లో సీఎం జగన్, టిడిపి అధినేత‌ చంద్రబాబు, ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్,హీరోయిన్ సమంత, కోహ్లీ..రోహిత్‌ శర్మ, మెగాస్టార్ చిరంజీవి ఇలా చాలా మంది ఉన్నారు. బ్లూ టిక్‌ పోవడంతో ఈ స్టార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img