Monday, March 27, 2023
Monday, March 27, 2023

భారత్‌కు పొంచి ఉన్న ఎల్‌-నినో ముప్పు..

ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయ్‌…
పసిఫిక్‌ సముద్రం మధ్య, తూర్పు ప్రాంత ఉపరితలంలో అధిక ఉష్ణోగ్రతలకు కారణమయ్యే ఎల్‌నినో ప్రభావం రాబోయే నెలల్లో పెరగనున్నదని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎమ్‌వో) హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో సాధారణం కంటే 4 నుండి 5 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా ఉంటే ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడతాయి. రానున్న రోజుల్లో గ్లోబల్‌ టెంపరేచర్‌ ధారణ అసాధారణ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్‌ పీటెరీ తాలస్‌ తెలిపారు. ఎల్‌-నినో ప్రభావం మార్చి-మే మధ్య 90 శాతం సంభవించవచ్చని పేర్కొంది. ఎల్‌నినో, లానినా ప్రభావాలు సహజంగా సంభవిస్తాయని డబ్ల్యూఎమ్‌వో తెల్పింది. వీటి ప్రభావం సీజనల్‌గా కురిసే వర్షపాతాలపై పడుతుందని, ఫలితంగా వర్షపాతం తగ్గి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతున్నాయని డబ్ల్యూఎమ్‌వో పేర్కొంది. ఎల్‌ నినో సదరన్‌ ఆసిలేషన్‌ తాజా సమాచారం ప్రకారం.. ఎల్‌ నినో కారణంగా రాబోయే మూడేళ్లలో అంటే 2026లోపు ఒక ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా నమోదయ్యే అవకాశం 93 శాతం ఉంది. ముఖ్యంగా భారత్‌లో వర్షపాతం తగ్గి హీట్‌వేట్‌ ప్రమాదం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చిరించింది.గడచిన ఏళ్లలో 2016లో ఏర్పడిన ఎల్‌ నినో పరిస్థితులు ఎన్నడూలేని విధంగా అత్యంత వేడి వాతావరణాన్ని సృష్టించిన ఏడాదిగా మిగిలిపోయింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భూగోళ ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. ఇది 2016 రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img