Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

భారత్‌ అంతర్గత విషయాల్లోజోక్యం తగదు

పాక్‌ మంత్రి వ్యాఖ్యలపై రాజా ఆగ్రహం

న్యూదిల్లీ : ఆర్టికల్‌ 370పై కాంగ్రెస్‌-నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూటమి వైఖరిని పాకిస్థాన్‌ రక్షణ మంత్రి సమర్ధించడంపై సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా గురువారం తీవ్రంగా స్పందించారు. భారత్‌ అంతర్గత విషయాల్లో పాకిస్థాన్‌ రక్షణ మంత్రి తలదూర్చడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌కూ ఇది వర్తిస్తుందని హితవు పలికారు. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ అనంతరం పాకిస్థాన్‌ ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని డి.రాజా నిలదీశారు. భారత్‌ అంతర్గత విషయాల్లో పాక్‌ జోక్యం నివారించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. జమ్మూ కశ్మీర్‌ ప్రజలు పరిణితి చెందిన వారని, జమ్మూకశ్మీర్‌కు, దాని భవిష్యత్‌కు ఏమి చేయాలనేది వారికి స్పష్టంగా తెలుసునని వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌ గాంధీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా పాకిస్థాన్‌ భాష మాట్లాడుతున్నారని, పాక్‌ కనుసన్నల్లో నడుస్తున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ఆరోపించారు. అదేసమయంలో ఆర్టికల్‌ 370పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వైఖరిని పాకిస్థాన్‌ రక్షణ మంత్రి సమర్ధించడం పట్ల ఫరూక్‌ అబ్ధుల్లా స్పందించారు. పాకిస్థాన్‌ ఏం చెప్పిందనేది తనకు తెలియదని వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాను పాకిస్థానీ కాదని, భారత పౌరుడినని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img