37 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 37 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రఘువీరారెడ్డి, సిద్దార్థ్ కౌశల్, ఎస్.శ్రీధర్, సుమిత్ సునీల్, పి.జగదీశ్, సత్తిబాబు, రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్‌ను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే… శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కేవీ మహేశ్వర్‌రెడ్డి, విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్, అనకాపల్లికి ఎం.దీపిక, సత్యసాయి జిల్లాకు వి.రత్న, పార్వతీపురం మన్యం జిల్లీ ఎస్పీగా ఎస్వీ మాధవరెడ్డి, కాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్‌ను బదిలీ చేసింది. గుంటూరుకు ఎస్.సతీశ్ కుమార్, అల్లూరి జిల్లాకు అమిత్ బర్దార్, విశాఖ సిటీ డిప్యూటీ కమిషర్ 1గా అజిత వేజెండ్ల, విశాఖ సిటీ డిప్యూటీ కమిషర్ 2గా తుహిన్ సిన్హా, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా డి.నరసింహ కిషోర్, అన్నమయ్య జిల్లాకు వి.విద్యాసాగర్ నాయుడు, కోనసీమ జిల్లాకు బి.కృష్ణారావు, కృష్ణా ఎస్పీగా ఆర్.గంగాధర్‌రావు, పశ్చిమగోదావరి జిల్లాకు అద్నాన్ నయీమ్ ఆస్మీ, ఏలూరు జిల్లాకు కె.ప్రతాప్ శివకిశోర్, పల్నాడు జిల్లాకు కె.శ్రీనివాసరావు, ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్‌గా మల్లికాగార్గ్, ప్రకాశం జిల్లాకు ఏఆర్.దామోదర్, కర్నూలు జిల్లాకు జి.బిందు మాధవ్, నెల్లూరు జిల్లాకు జి.కృష్ణకాంత్, నంద్యాల జిల్లాకు అధిరాజ్‌సింగ్ రానా, కడప జిల్లాకు వి.హర్షవర్ధన్ రాజు, అనంతపురం జిల్లాకు కేవీ మురళీ కృష్ణ, బాపట్ల జిల్లాకు తుషారు డూడీని బదిలీ చేసింది.
తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్.సుబ్బారాయుడును బదిలీ చేసింది. అలాగే ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా (శాంతి భద్రతలు) గౌతమీ శాలి, ఇంటెలిజెన్స్ అడ్మిన్ ఎస్పీగా వి.గీతాదేవిని బదిలీ చేసింది.