Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

భౌతికశాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్‌

ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి ముగ్గురిని వరించింది. శాస్త్రవేత్తలు స్యుకురో మనాబె, క్లాస్‌ హాసెల్‌మాన్‌, గియోర్గియో పారిసిలకు ఫిజిక్స్‌ నోబెల్‌ ఇస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ మంగళవారం ప్రకటించింది. నోబెల్‌తోపాటు ఇచ్చే ప్రైజ్‌మనీలో సగం పారిసికి, మిగతా సగం మానబె, హాసెల్‌మాన్‌లకు ఇవ్వనున్నట్లు అకాడమీ తెలిపింది. సంక్లిష్ట భౌతిక వ్యవస్థలపై విశ్లేషణలకుగానూ వీరికి నోబెల్‌ను ప్రకటించారు. గియోర్గియో పారిసి క్రమరహిత సంక్లిష్ట పదార్థాలలో దాగి ఉన్న నమూనాలను కనుగొన్నారు. వాతావరణం, పర్యావరణాన్ని కలిపే మోడల్‌ను సృష్టించిన క్లాజ్‌ హాసెల్‌మాన్‌ను నోబెల్‌ వరించింది. వాతావరణంలో కార్బన్‌డైఆక్సైడ్‌ స్థాయులు పెరిగిన కొద్దీ భూ ఉపరితల ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతున్నాయో నిరూపించిన స్యుకురో మనాబెను ఈసారి ఫిజిక్స్‌ నోబెల్‌కు ఎంపిక చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img