Saturday, November 2, 2024
Saturday, November 2, 2024

మాకు సంఖ్యా బలం ఉంది

ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్‌

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్‌ దాఖలు చేశారు. బొత్స నివాసానికి పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి ఇంటి నుంచి విశాఖ కలెక్టరేట్‌కు బొత్స బయలుదేరి వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఆరో రోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.

విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం : ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్‌ దాఖలు చేశారు. బొత్స నివాసానికి పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి ఇంటి నుంచి విశాఖ కలెక్టరేట్‌కు బొత్స బయలుదేరి వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఆరో రోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 1.45 గంటలకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కలెక్టరేట్‌కు చేరుకొని ఆర్వో కార్యాల యంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌కు మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. బొత్స వెంట ఆయన సతీమణి రaాన్సీ, అరకు ఎంపీ తనూజ రాణి, మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు, విశాఖ నగర మేయర్‌ హరివెంకట కుమారి ఉన్నారు. నామినేషన్‌ దాఖలు చేసిన వెంటనే సంప్రదాయం ప్రకారం బొత్స సత్యనారాయణ ప్రమాణం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కోరారని, ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్‌ వేసినట్లు చెప్పారు. తమకు సంఖ్యా బలం ఉందని, తప్పకుండా విజయం సాధిస్తామని అన్నారు. మాకు 530 మందికి పైగా ప్రజాప్రతినిధుల బలం ఉన్నప్పుడు కూటమి అభ్యర్థిని ఎందుకు బరిలో నిలుపుతోందని ప్రశ్నించారు. ఇదిలాఉండగా, మంగళవారంతో నామినేషన్లకు గడువు ముగుస్తుండగా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కూటమిలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొత్తగా దిలీప్‌ చక్రవర్తి పేరు తెరపైకి రాగా, ప్రచారంలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ దూసుకుపో తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీకి మరింత బలం పెరిగింది. ఆరు వందలకుపైగా ఓటర్లతో ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యత ఉంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 838 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 39 మంది జెడ్పీటీసీల్లో ప్రస్తుతం 36 మంది జెడ్పీటీసీలు ఉన్నారు.
అల్లూరి జిల్లాకు చెందిన హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం అరకు వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రావికమతం జెడ్పీటీసీ తలారి రమణమ్మ, సబ్బవరం జెడ్పీటీసీ తుంపాల అప్పారావు చనిపోయారు. ప్రస్తుతం ఉన్న జెడ్పీటీసీల్లో వైసీపీకి 34 మంది, టీడీపీకి నర్సీపట్నం జెడ్పీటీసీ, సీపీఎంకు అనంతగిరి జెడ్పీటీసీ ఉన్నారు. మొత్తం 652 మంది ఎంపీటీసీలకు గాను 636 మంది ఎంపీటీసీలు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img