Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

ముఖ్యమంత్రిగా ఎవరు కావాలి..? గుజరాత్‌లో ఆప్‌ పోల్‌

నవంబర్‌ 4న ఫలితాలు వెల్లడిస్తామన్న ఆప్‌ అధినేత
పంజాబ్‌ మాదిరే గుజరాతీ పౌరులకు తమ ముఖ్యమంత్రి ఎవరో ఎంపిక చేసుకునే ఆప్షన్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ కల్పిస్తున్నట్లు దిల్లీ సీఎం, ఆప్‌ ముఖ్యనేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. శనివారం ఉదయం మీడియా సమావేశంలో భాగంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘‘తదుపరి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి? దయచేసి మీ అభిప్రాయాన్ని పంచుకోండి’’అని కోరారు. 6357000360 నంబర్‌కు వాయిస్‌ మెస్సేజ్‌, వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌ లను నవంబర్‌ 3 నాటికి పంపించాలని సూచించారు. అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ మెయిల్‌ ఐడీని కూడా ప్రకటిస్తామన్నారు. ఫలితాలను 4న వెల్లడిస్తామని చెప్పారు. అలాగే, పనిలో పనిగా అధికార బీజేపీపై ఆయన విమర్శలు చేశారు. తదుపరి ఐదేళ్ల విషయంలో బీజేపీ వద్ద ప్రణాళిక ఏదీ లేదన్నారు. ఏడాది క్రితం వారు ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపాణిని తొలగించి భూప్రేంద పటేల్‌ ను నియమించారు. ఆ సందర్భంలో ప్రజల అభిప్రాయాన్ని కోరలేదు. కానీ, మేము అలా చేయడం. ఆప్‌ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటుంది’’అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది ఆరంభంలో పంజాబ్‌ ఎన్నికలకు ముందు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించి, వారిలో మీ మద్దతు ఎవరికో తెలియజేయాలని ఆప్‌ ప్రజలను కోరడం తెలిసిందే. మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు భగవంత్‌ మాన్‌ను ఎంపిక చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img