Wednesday, October 30, 2024
Wednesday, October 30, 2024

రాటుదేలిన రాహుల్‌

. ప్రతిపక్షాలను నడిపించడమే అసలైన పరీక్ష
. ఒకప్పుడు ఆయనకు రాజకీయాలు నచ్చేవి కాదు
. నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌

బోల్పూర్‌ (పశ్చిమబెంగాల్‌): కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కాలంతో పాటు చాలా పరిణతి చెందారని నోబెల్‌ బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ అమర్త్యసేన్‌ అన్నారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో పార్లమెం టులో ప్రతిపక్షాలను ఎలా నడిపిస్తార న్నదే ఆయనకు అసలైన పరీక్ష అని చెప్పుకొచ్చారు. రాహుల్‌ ‘భారత్‌ జోడో యాత్ర’ తనను జాతీయ నాయకుడిగా నిలబెట్టడమే కాకుండా దేశ రాజకీయా లను కూడా మార్చిందని అమర్త్యసేన్‌ అభిప్రాయపడ్డారు. రాహుల్‌ కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలోని ట్రినిటీ కాలేజ్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడు… రాజకీయాలు ఆయనకు నచ్చేవికాదని… జీవితంలో తాను ఏమి చేయాలనుకుంటున్నాడన్న విషయంలో స్పష్టత ఉండేది కాదని ప్రొఫెసర్‌ అమర్త్యసేన్‌ వెల్లడిరచారు. రాహుల్‌ గాంధీ ఇప్పుడు చాలా పరిణతి చెందిన వ్యక్తి అని తాను భావిస్తున్నట్లు అమర్త్యసేన్‌ చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో కాంగ్రెస్‌ అధినేతగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్ప టికీ… గత కొద్దికాలంగా తనలో చాలా మార్పు కనిపిస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌ జిల్లా బోల్‌పూర్‌లోని తన పూర్వీకుల నివాసంలో పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సేన్‌ తన మనసులోని మాటను పంచుకున్నారు. రాహుల్‌ గాంధీలో భారతదేశ తదుపరి ప్రధానిని చూడగలరా అని అడిగిన ప్రశ్నకు ఆయన నవ్వుతూ… అలాంటి అవకాశాలను అంచనా వేయడం చాలా కష్టమని అన్నారు. ‘ఈ విషయానికి నేను సమాధానం చెప్పను. ఎవరు ప్రధానమంత్రులు అవుతారో పట్టుకోవడం చాలా కష్టం’ అన్నారు. ‘నేను దిల్లీలో విద్యార్థిగా ఉన్నప్పుడు, నా తోటి విద్యార్థులలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఎవరికి తక్కువ అని ఎవరైనా నన్ను అడిగితే… మన్మోహన్‌కు రాజకీయాలపై ఆసక్తి లేనందున నేను మన్మోహన్‌ సింగ్‌ అని చెప్పేవాడిని. కానీ ఆయన ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి, ఈ విషయాలను అంచనా వేయడం కష్టం’ అని సేన్‌ తెలిపారు. రాహుల్‌ ‘భారత్‌ జోగో యాత్ర’ గురించి ప్రస్తావిస్తూ… ‘‘రాహుల్‌ మంచి పని చేశాడు. యాత్ర భారతదేశానికి, అతనికి మంచిదని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా రాజకీయా లపై తన ఆలోచనలను స్పష్టంగా చెప్పగలగడంలో ఎంతో మెరుగయ్యాడని నేను భావిస్తున్నాను’ అన్నారు. భారతదేశంలో అసమానత, మతవిద్వేషం వంటి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడంలో రాహుల్‌ గాంధీ పాత్ర ప్రాముఖ్యతను వివరిస్తూ… సేన్‌ ముగించారు. ‘అసమానత్వం, మతతత్వం గణనీయస్థాయిలో పెరుగుదలను చూసిన ఒక దేశంలో అతను ప్రతిపక్షాన్ని ఎలా నడిపిస్తారనేది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులు వంటి మైనారిటీలపై అధిక ఆధిపత్యాన్ని చెలాయించే మెజారిటీ సమాజానికి సంబంధించి అదే అతని ప్రధాన పాత్ర. అతను దానిని చక్కగా నిర్వహిస్తున్నాడని నేను భావిస్తున్నాను’ అని సేన్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img