Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వచ్చేనెల 4న ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు

అక్టోబర్‌ 4న ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బెంగాల్‌, అసోం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ఒక్కో రాజ్యసభ స్థానానికి, తమిళనాడులో రెండు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 15న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. 22వ తేదీ వరకు కొనసాగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ సెప్టెంబర్‌ 27. పోలింగ్‌ ప్రక్రియ 4వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img