London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Wednesday, October 23, 2024
Wednesday, October 23, 2024

వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు

ఫైనల్‌ ముంగిట ఒలింపిక్‌ సంఘం నిర్ణయం
100 గ్రాముల బరువు పెరగడమే కారణం
కోట్లాది భారత అభిమానులకు షాక్‌్‌

ఒలింపిక్స్‌ నుంచి దురదృష్టకర రీతిలో నిష్క్రమించిన వినేశ్‌ ఫొగాట్‌ మౌనం వీడిరది. ‘‘ ఇది చాలా బాధాకరం, మనం మెడల్‌ పోగొట్టుకున్నాం. కానీ ఇది ఆటలో భాగం’’ అని తనను కలిసిన భారత కోచ్‌లు
వీరేందర్‌ దహియా, మన్జీత్‌రాణికి చెప్పింది.

న్యూదిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరుకుని పతకాన్ని ముద్దాడుతుందనుకున్న భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు ఊహించని షాక్‌ తగిలింది. అధిక బరువు కారణంగా ఫైనల్‌కు ముందే ఆమెపై ఒలింపిక్స్‌ నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. దీంతో ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫొగాట్‌ పతకం సాధిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న కోట్లాదిమంది భారత క్రీడాభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మహిళల 50 కేజీల విభాగంలో బుధవారం రాత్రి ఫైనల్‌లో వినేశ్‌ తలపడాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వినేశ్‌పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్‌ కమిటీ, రెజ్లింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. ‘వినేశ్‌ ఫొగాట్‌ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడిరది. దయచేసి వినేశ్‌ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరం’’ అని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ప్రకటించింది.
సవాల్‌ చేసిన ఐవోఏ వినేశ్‌ ఫొగాట్‌ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఐఓఏ సవాల్‌ చేసింది. ఒలింపిక్‌ అసోసియేషన్‌ నిబంధనల ప్రకారం.. పోటీ జరిగే రోజున బరువుతోపాటు వైద్య పరీక్షలను నిర్వహించడం సాధారణమే. అయితే, మంగళవారం రాత్రి సెమీస్‌ పోరులో తలపడిన ఫొగాట్‌ బుధవారం ఉదయానికే బరువు పెరగడంపైనా ఐఓఏ అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. నంబర్‌ వన్‌ రెజ్లర్‌ సుసాకీపై విజయం సాధించి ఫైనల్‌కు చేరిన ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం సర్వత్రా షాక్‌కు గురి చేసింది. దీంతో ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఐఓఏ డిమాండ్‌ చేసినట్లు కథనాలు వస్తున్నాయి.
ప్రపంచ నం.1ను ఓడిరచి…
ప్రిక్వార్టర్స్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌, టోక్యో ఒలింపిక్స్‌ పసిడి పతక విజేత సుసాకీ(జపాన్‌)ని ఓడిరచిన వినేశ్‌…క్వార్టర్‌ ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌పై గెలుపొందింది. తద్వారా సెమీస్‌ చేరి.. అక్కడ 5-0తో పాన్‌ అమెరికన్‌ గేమ్స్‌ ఛాంపియన్‌ యుస్నెలిస్‌ గుజ్మాన్‌ లోపెజ్‌ను మట్టి కరిపించింది. ఫలితంగా భారత రెజ్లింగ్‌ చరిత్రలో తొలిసారి ఒలింపిక్స్‌ ఫైనల్‌ చేరిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
వినేశ్‌ స్థానంలో ఫైనల్స్‌కు ఎవరంటే?
యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ నిబంధనల ప్రకారం బరువు ప్రమాణాలను అందుకోని క్రీడాకారిణిపై అనర్హత వేటు వేస్తారు. అంతేకాదు… ఆ పోటీల్లో చివరి ర్యాంక్‌ను ఇస్తారు. ప్రస్తుతం ఫైనల్స్‌ నుంచి బయటకు వెళ్లిపోయిన వినేశ్‌కు రజత పతకం ఇవ్వరు. అంతర్జాతీయ రెజ్లింగ్‌ నిబంధనల్లో ఆర్టికల్‌ 11 ప్రకారం… క్వార్టర్‌ ఫైనల్స్‌లో వినేశ్‌ చేతిలో ఓడిన గుజ్మన్‌ లోపేజ్‌ (క్యూబా)కు అమెరికాకు చెందిన సారా హిల్డర్‌బ్రాంట్‌కు ఫైనల్స్‌ జరుగుతుంది. ఈ విషయాన్ని ఒలింపిక్‌ నిర్వాహకులు ప్రకటించారు. బుధవారం రాత్రి 11.23కు ఈ మ్యాచ్‌ మొదలు కానుంది. కాంస్యపతక పోరులో జపాన్‌ క్రీడాకారిణి సుసాకీ, ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సాన తలపడనున్నారు.
అవగాహన లోపమా?
వినేశ్‌పై ఒలింపిక్స్‌ ఫైనల్స్‌లో అనర్హత వేటు పడటంతో భారత్‌ కనీసం ఒక పతకం కోల్పోయింది. దీనికి భారత అధికారుల అవగాహన లోపం ఉందనే కథనాలు వస్తున్నాయి. వినేశ్‌ బరువు ప్రమాణాలకు తగినట్లు లేదని తెలిసిన వెంటనే.. అనారోగ్య కారణాలను చూపి పోటీ నుంచి వైదొలగితే అమెరికా క్రీడాకారిణికి స్వర్ణపతకం దక్కేదని…ఇక వినేశ్‌కు రన్నరప్‌ కింద రజతం అందేదన్నది వాటి సారాంశం. అయితే దీనిపై ఒలింపిక్‌ నిబంధనలు ఏం చెబుతున్నాయన్న దానిపై స్పష్టత లేదు.
దేశం మొత్తం వినేశ్‌కు అండగా ఉంది: పీటీ ఉష
భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ దురదృష్టకర రీతిలో పతక రేసునుంచి వైదొలగడంపై భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష స్పందించారు. ‘‘కొద్దిసేపటి క్రితమే ఒలింపిక్‌ క్రీడాగ్రామంలోని పాలీక్లినిక్‌లో వినేశ్‌ను కలిశాను. భారత ఒలింపిక్‌ సంఘం, భారత ప్రభుత్వం, దేశం మొత్తం ఆమెకు అండగా ఉందని హామీ ఇచ్చాను. వినేశ్‌కు వైద్యపరంగా, భావోద్వేగపరంగా సాయం అందిస్తున్నాం. అనర్హత వేటు విషయాన్ని రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా.. ‘యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌’ దృష్టికి తీసుకెళ్లింది. వినేశ్‌ను ఫైనల్స్‌కు సిద్ధం చేసేందుకు ఆమె వైద్య బృందం అవిశ్రాంత ప్రయత్నం చేసింది’’ అని పీటీ ఉష వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img