Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

వైద్యవిద్యపై కుట్ర

. చెప్పిందొకటి…చేసేది మరొకటా?
. కూటమి ప్రభుత్వంపై రామకృష్ణ ధ్వజం
. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై చంద్రబాబు, పవన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌

విశాలాంధ్ర`విజయవాడ: రాష్ట్రంలో వైద్య విద్యను ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. స్థానిక దాసరి భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన దానికి అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్నదానికి పొంతన ఉండటం లేదని విమర్శించారు. వైద్య కళాశాలల ఏర్పాటులో జగన్‌ ప్రభుత్వం జీవో 107, 108లను తీసుకువచ్చి 50శాతం సీట్లను ప్రైవేటుపరం చేసిందని… ఆనాడు రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు, కమ్యూనిస్టు పార్టీ, వైద్య విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో కూడా తాము అధికారంలోకి వస్తే ఆ జీవోలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) వైద్యసీట్లు ఇప్తామంటే… వాటిని భర్తీ చేయలేమని…మాకు వద్దని లేఖ రాయటం దారుణం అన్నారు. భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాటు, అధ్యాపకుల కొరత అంశాలను పరిష్కరించుకునే విధానం ఆలోచించకుండా సీట్లు వద్దని చెప్పటం మంచికాదన్నారు. గుజరాత్‌ తరహా విధానం తీసుకు వచ్చేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. గుజరాత్‌లో కేవలం 6 కళాశాలలు మాత్రమే ప్రభుత్వం అధ్వర్యంలో ఉన్నాయని మిగిలినవి ప్రైవేటువ్యక్తుల చేతుల్లో ఉన్నాయని చెప్పారు. వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు బహిరంగ సవాల్‌ చేయటం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి తప్ప వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు రావాలనడంలో అర్థం లేదన్నారు. ఎన్నికల ప్రచారం, పాదయాత్ర, విద్యార్థి ఉద్యమాల సందర్భంగా టీడీపీ నాయకులు ఏం చెప్పారో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. కళాశాలల నిర్మాణం పూర్తి కాలేదన్న నెపంతో అసలు వైద్య సీట్లే వద్దనడం మూర్ఖత్వం అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీని వెనక్కు తీసుకున్నట్లు కనబడుతోందని రామకృష్ణ సందేహం వ్యక్తం చేశారు. రెండు బ్లాస్ట్‌ ఫర్నేసులు ఆపేశారని, ఇనుము, బొగ్గు సరఫరా నిలిపేశారని, మూలధనం లేకుండా చేసి అప్పుల పాల్జేశారని తెలిపారు. టాటా స్టీల్‌ కంటే ప్రత్యేక గుర్తింపు కలిగిన విశాఖ ఉక్కును నష్టాల బాటపట్టించారని ధ్వజమెత్తారు. ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన 22 వేల ఎకరాల భూమిని అదాని, ఇతర కార్పోరేట్‌ సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు రాజీనామా చేస్తానని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాము పల్లా శ్రీనివాసరావుని, గంటా శ్రీనివాసరావుని రాజీనామా చేయాలని కోరటం లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి బయటకు రావాలని సూచించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతుందనే అనుమానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటీకరణ చేయబోమని కేంద్రం చేత విస్పష్ట ప్రకటన చేయించాలన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గనులు కేటాయించాలన్నారు. ఇక ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగ సంఘాలు, వాటి నాయకుల తీరు మారటం లేదన్నారు. పోలీసులు టోపీ, ఖాకీ దుస్తులు ధరించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎక్సైజ్‌ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసులు ఏమైనా తెలుగుదేశం పార్టీలో చేరారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కూడా పోలీసులు ఇలాగే చేశారని ఇప్పుడు ఉన్నతస్థాయికి చెందిన ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు సస్పెండ్‌ అయ్యారని తెలిపారు. జగన్‌ చెప్పగానే గుడ్డిగా పాటించటం వల్లే ఇలా జరిగిందన్నారు. పోలీసులకు ప్రభుత్వం మంచి చేస్తే ధన్యవాదాలు చెప్పవచ్చుగాని పాలాభిషేకాలు చేయటం సరికాదన్నారు. ఐపీఎస్‌ల సస్పెన్షన్‌ పోలీసు వ్యవస్థకు గుణపాఠం కావాలన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు వ్యక్తిత్వంతో బతకాలని, బాధ్యతగా ఉండాలని హితవు పలికారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌ (మాజీ ఎమ్మెల్సీ), జి.ఈశ్వరయ్య, అక్కినేని వనజ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img