Monday, April 22, 2024
Monday, April 22, 2024

స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు


దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 30,549 కరోనా కేసులు నమోదు కాగా, 422 మంది కరోనా మరణించారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,17,26,507కి చేరుకుంది. ఇప్పటి వరకు కరోనాతో దేశంలో 4,25,195 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 3,08,96,354 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు.ప్రస్తుతం దేశంలో 4,04,958 యాక్టివ్‌ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. టీకా డ్రైవ్‌లో మొత్తం 47,85,44,114 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img