Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

అన్ని విధాలా ఆదుకోవాలి

రైలు ప్రమాదంపై కేంద్రానికి సీపీఐ డిమాండ్‌

న్యూదిల్లీ: ఒడిశాలో సంభవించిన ఘోర రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సానుభూతిని ప్రకటించింది. బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని, అవసరమైన సహాయ, సహకరాలు తక్షణమే అందేలా చూడాలని కేంద్రప్రభుత్వాన్ని శనివారం ఒక ప్రకటనలో పార్టీ జాతీయ కార్యదర్శివర్గం డిమాండ్‌ చేసింది. ఈ దుర్ఘటన షాక్‌కు గురిచేసిందని, దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోవడం, సుమారు వెయ్యి మంది గాయపడటం కలచివేసిందని పేర్కొంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటం బాధాకరమని వెల్లడిరచింది. ఏదేని సంస్కరణ మానవీయ కోణంలోనే జరగాలి లేకపోతే ఇటువంటి మానవ విపత్తులే సంభవిస్తాయని చాలా కాలంగా మొత్తుకుంటున్నామని తెలిపింది. బులెట్‌ ట్రైన్లను తీసుకురావడం, చాలా రైళ్ల వేగాన్ని పెంచడం వంటివి మోదీ ప్రభుత్వం చేస్తోందిగానీ అందుకు అనుగుణంగా రైల్వే పట్టాలనుగానీ ఇతర మౌలికవసతులనుగానీ మెరుగుపర్చడంలేదు. ఇప్పటికైనా వీటిపై దృష్టిని కేంద్రీకరించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు ప్రకటనలో పేర్కొంది. రైలు ప్రమాదానికిగల కారణాలను అన్వేషించాలని, ట్రాకులు తదితర రైల్వే మౌలిక వసతుల సామర్థ్యం, రైల్వే యంత్రాంగం తరపు నిర్లక్ష్యం ఉందా వంటి అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేసింది. యుద్ధప్రాతిపదికన బాధితులకు సాయం అందించాలని కేంద్రప్రభుత్వా న్ని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గం కోరింది.
ఇది తిరోగమన చర్య: దేశద్రోహాన్ని శిక్షార్హమైన నేరంగా ఉంచాలని, ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని 22వ భారత లా కమిషన్‌ సిఫార్సులు చేయడం దేశాన్ని మధ్యయుగానికి తీసుకెళ్లడమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గం వ్యాఖ్యానించింది. ఇది తిరోగమన చర్యని, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని తాజా ప్రకటనలో పేర్కొంది. గతేడాది ఐపీసీలోని 124 ఏ సెక్షన్‌ను రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలివ్వడాన్ని ప్రస్తావించింది. దేశ ద్రోహం అన్నది బ్రిటిష్‌ కాలం నాటి చట్టమని, ప్రజా స్వామ్య ఆకాంక్షలను అణచివేయడమే దాని ఉద్దేశ మని తెలిపింది. స్వాతంత్య్రం వచ్చాక ఈ చట్టాన్ని కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని, అధికరణ 19 స్ఫూర్తికి వ్యతిరేకమని నొక్కిచెప్పింది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని తమ పార్టీ చాలా కాలంగా డిమాండ్‌ చేస్తోందని, దీనిపై ప్రైవేటు బిల్లును సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా 2011లో రాజ్యసభలో ప్రవేశపెట్టార ని గుర్తుచేసింది. దేశద్రోహం చట్టాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి ప్రజాస్వామ్యంలో భావప్రకటన, వాక్‌ స్వేచ్ఛకు హామీనివ్వాలని తాజా ప్రకటనలో సీపీఐ జాతీయ కార్యదర్శివర్గం డిమాండ్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img