Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఏపీని గట్టెక్కించండి

. 2014 కంటే పరిస్థితి ఘోరం
. పోలవరానికి తక్షణమే రూ.12,500 కోట్లు ఆవశ్యం
. నీతి ఆయోగ్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు వినతి

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్ర విభజన నాటికంటే ఏపీ పరిస్థితి ఘోరంగా ఉందని, కేంద్రమే అండగా నిలబడి గట్టెక్కించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం దిల్లీలో నీతి ఆయోగ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ఏపీకి రావాల్సిన నిధులు, కేటాయింపులు, ఇంకా అమలు కాని విభజన అంశాలను ప్రస్తావించారు. అనంతరం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి చంద్రకాంత్‌ రఘునాథ్‌ పాటిల్‌ (సీఆర్‌ పాటిల్‌) ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణానికి అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. నీతి ఆయోగ్‌ సమావేశం ముగిసిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నవే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏపీకి ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. అమరావతి రాజధాని, పోలవరం జాతీయ ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి విభజన చట్టంలో ఉన్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే తర్వాత హోదాకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సహాయం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. విభజన సమయంలో ఆంధ్రా, తెలంగాణకు తలసరి ఆదాయం రూ.30 వేల తేడా ఉందని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో విభజన కంటే ఎక్కువ అధ్వానమైన పరిస్థితి ఏపీలో నెలకొందని, తలసరి ఆదాయం గణనీయంగా పడిపోయిందని చెప్పారు. ముఖ్యంగా గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి అత్యంత కీలకమైన సంపద సృష్టి ప్రాజెక్టులయిన పోలవరం, అమరావతి నాశనమయ్యాయి. అరాచక పాలనతో పరిశ్రమలు పారిపోయాయి. రాష్ట్ర విభజన వల్ల తీవ్ర అన్యాయం జరిగినందున ఏపీ పునర్నిర్మాణం కోసం కేంద్రాన్ని సహాయం అడుగుతున్నాం. స్వచ్ఛ భారత్‌, జల జీవన మిషన్‌లో గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం వెనుకబడి ఉంది. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లించారు. ఏ మంత్రిత్వ శాఖ దగ్గరకు వెళ్లినా రాష్ట్రం వెనుకబడిన గణాంకాలే చూపిస్తున్నారు. పోలవరం, అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపాను. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించడానికి ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచాం. ఏపీ క్యాబినెట్‌ చేసిన తీర్మానాన్ని అందజేశాను. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించేందుకు అవసరమైన రూ.12,500 కోట్ల ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం వెంటనే ఆమోదించేలా చూడాలని కోరానని చంద్రబాబు వివరించారు. పోలవరం ప్రాజెక్టులో తొలి, మలి దశలనేవి ఏమీ లేవని, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం ఒక్కటే లక్ష్యమని స్పష్టం చేశారు. గోదావరి వరదలు తగ్గేలోపు మూడు నెలల్లోగా ఒక నిర్ణయం తీసుకుని పనులు చేపట్టకపోతే మరో సీజన్‌ కూడా కోల్పోయే అవకాశం ఉందన్నారు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని, అదే విషయాన్ని కేబినెట్‌లో ఆమోదించి కేంద్రానికి అందజేశామని తెలిపారు. కేంద్రం కొత్త డయాఫ్రం వాల్‌ను ఖరారు చేయగానే దానికనుగుణంగా యంత్రాలను తరలించాల్సి ఉంటుందన్నారు. డయాఫ్రం వాల్‌ తర్వాత దానిపైన ఎర్త్‌కం రాక్‌ఫిల్‌ డ్యాం వస్తుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img