Saturday, May 11, 2024
Saturday, May 11, 2024

కీలక వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచిన ఆర్బీఐ..

రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వివరించారు. రెపో రేటును మార్చడం లేదని, 4 శాతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. రివర్స్‌ రెపో రేటు 3.35 శాతమని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం ఈ సారి కూడా సర్దుబాటు ధోరణినే కొనసాగించనున్నట్లు వెల్లడిరచారు. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం వరుసగా ఇది పదో సారి. ఈ రేట్లను చిట్టచివరిసారి 2020 మే 22న మార్చింది. మానెటరీ పాలసీ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన మంగళవారం నుంచి సమీక్ష నిర్వహించారు. వీరంతా ఏకగ్రీవంగా ఈ రేట్లను మార్చకూడదని నిర్ణయించారు. వృద్ధికి ఊతమివ్వడం కోసం ద్రవ్యోల్బణాన్ని నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ఉండటం కోసం అవసరమైనంత వరకు ఇదే ధోరణిని కొనసాగించాలని నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img