Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

దేశంలో కరోనా కల్లోలం…రేపు సీఎంలతో ప్రధాని మోదీ భేటీ

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విజృభిస్తోంది. కొద్దిరోజులుగా లక్ష పైనే నమోదవుతున్న కొత్త కేసులు తాజాగా రెండు లక్షలకు చేరువయ్యాయి. కొవిడ్‌ బారినపడి నిన్న 400 మందికి పైగా మృతిచెందారు. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. కొవిడ్‌ కేసులు ఆందోళనకరస్థాయిలో పెరుగుతున్నందున వైరస్‌ కట్టడికి రాష్ట్రాలు విధిస్తున్న ఆంక్షలు, వైద్య సన్నద్ధత, టీకా కార్యక్రమం అమలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై సమీక్షించనున్నారు. మరోవైపు కేసులు పెరుగుతున్నందున అన్ని రాష్ట్రాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో మకరసంక్రాంతి రోజు హరిద్వార్‌, రిషికేష్‌లోని గంగానది ఘాట్‌ల వద్ద పవిత్ర స్నానాలను నిషేధించారు. ఒడిశా ప్రభుత్వం కూడా వరుసగా మూడు రోజులపాటు సముద్ర, నదీ తీరాల వద్ద, చెరువుల వద్ద పుణ్యస్నానాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దిల్లీ ఇప్పటికే రెస్టారెంట్లు, బార్లపై నిషేధం విధించింది. ప్రైవేటు కార్యాలయాలను కూడా పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img