Friday, May 3, 2024
Friday, May 3, 2024

పరస్పర సహకారం

మోదీ, జగన్‌ సర్కార్లపై నారాయణ

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పబ్బంగడుపుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిని ఉపయోగించుకుంటోందనీ, జగన్‌ కూడా తన అవసరాలు తీర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి దాసోహమంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టరు కె.నారాయణ విమర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను జగన్‌ కలవగానే దిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు శరత్‌ చంద్రా రెడ్డి అప్రూవర్‌గా మారిపోతారనీ, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాశ్‌రె డబ్డికి బెయిల్‌ వస్తుందనీ , ఇదంతా క్విడ్‌ ప్రో కో మాదిరిగా మారిందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు స్పాట్‌పెట్టేం దుకు జగన్‌ను కేంద్ర ప్రభుత్వం పావుగా వాడుకుంటోందని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరా బాద్‌ మక్దూం భవన్‌ వద్ద నారాయణ శుక్రవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, పార్లమెంట్‌ నూతన భవన ప్రారం భానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడాన్ని తప్పు పట్టారు. పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోతే ప్రతిపక్షాలు ప్రశ్నించాయని, అయితే తెలంగాణలో నూతన సచివాలయం ప్రారంభానికి తనను కూడా ఆహ్వా నించలేదని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యానిం చారని అన్నారు. రాష్ట్రపతిని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకున్నారని, గవర్నర్‌ని కేంద్రం ప్రభుత్వం నియమించిందన్నారు. గవర్నర్‌ తనను ఆహ్వానించలేదని అక్షేపించడంలో అర్ధం లేదన్నారు. రాష్ట్రపతిగా ఉన్న ఆదివాసీ గిరిజన మహిళను పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్స వానికి ఆహ్వానించకపోవడం విచారకరమన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా భూ సమస్య పరిష్కారం కాలేదనీ, భూస్వాములకే తిరిగి చట్టబద్ధంగా భూములు అప్పగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి సీపీిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటీ నరసింహ అధ్యక్షత వహించగా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, వీఎస్‌ బోస్‌, పశ్య పద్మ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img