Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రొఫెసర్‌ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు

విశాలాంధ్ర – హైదరాబాద్‌: పౌరహక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆయుధాల చట్టం, భారత శిక్షాస్మృతిలోని 10 సెక్షన్‌ కింద కేసులు దాఖలయ్యాయి. హరగోపాల్‌తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులు ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఉన్నారు. పీపుల్స్‌ డెమొక్రటిక్‌ మూవ్‌మెంట్‌ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళిని రెండునెలల కింద పోలీసులు అరెస్ట్‌ చేయడం, ఆయన బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఈ విషయం బయటపడిరది. చంద్రమౌళిపై మరిన్ని కేసులు ఉన్నాయని బెయిల్‌పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు పోలీసులు తెలిపారు. మొత్తం అన్ని కేసుల వివరాలు అందజేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్‌ను ప్రస్తావించారు. ఆ ఎఫ్‌ఐఆర్‌లో ప్రొఫెసర్‌ హరగోపాల్‌ పేరు బయటపడిరది. మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు అధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రభుత్వాన్ని కూలదోయడం, పార్టీకి నిధులు సమకూర్చు కోవడం, అమాయక యువకులను మావోయిస్టు పార్టీలోకి పంపడం వంటి పనులు చేసినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ప్రొఫెసర్‌ హరగోపాల్‌తోపాటు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్‌, ప్రొఫెసర్‌ పద్మజా షా, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వి.రఘు నాథ్‌, చిక్కుడు ప్రభాకర్‌ తదితరుల పేర్లు న్నాయి. కాగా,152 మంది ఉద్యమకారులు, మేధావులను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చారు. తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసుల గాలింపు సందర్భంగా లభించిన డైరీల్లో హరగోపాల్‌ తదితర మేధావుల పేర్లు ఉన్నాయి. అందుకే వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాగా హరగోపాల్‌పై కేసు నమోదు చేయడాన్ని ప్రతిపక్షాలు ఖండిరచాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img