Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

యర్రగొండపాలెం ఉద్రిక్తం

. చంద్రబాబు రోడ్‌షోకు వైసీపీ అడ్డంకులు
. వైసీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తల తోపులాట
. మంత్రి కార్యాలయంపై రాళ్లు విసిరిన టీడీపీ శ్రేణులు

విశాలాంధ్ర బ్యూరో – ఒంగోలు: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రానికి ఇదేమికర్మ కార్యక్రమంలో భాగంగా చద్రబాబు శుక్రవారం యర్రగొండపాలెంలో పర్యటిస్తున్నారు. గతంలో దళితుల పట్ల అనుచితంగా వ్యవహరించిన చంద్రబాబు క్షమాపణ చెప్పి యర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రవేశించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖమంత్రి ఆదిమూలపు సురేశ్‌ వైసీపీ కార్యకర్తలతో కలిసి నిరసన ప్రదర్శనకు దిగారు. నల్లవస్త్రాలు ధరించి…నల్ల బెలూన్లు ఎగురవేసి చంద్రబాబు గో బ్యాక్‌ అంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ నాయకత్వంలోఆందోళనకు దిగారు. చంద్రబాబు రోడ్‌షోను అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున రోడ్లమీదకు తరలివచ్చారు. రెండువర్గాలను అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఒకరికొకరు విమర్శలు చేసుకుంటూ రాళ్లు రువ్వుకున్నారు. చంద్రబాబు యర్రగొండపాలెంలోకి ప్రవేశించగానే టీడీపీ శ్రేణులు రోడ్డు పక్కనే ఉన్న మంత్రి కార్యాలయంపై రాళ్లు విసిరారు. పోలీసులు జోక్యం చేసుకొని రెండువర్గాలను నివారించ గలిగారు. ఈ క్రమంలో మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మాట్లాడుతూ దళితులను అవమా నించే విధంగా చంద్రబాబు గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. అందువల్ల దళిత నియోజకవర్గంలో పర్యటించే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు. చంద్రబాబుతో పాటు లోకేశ్‌ కూడా దళితుల పట్ల అనుచితంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రోడ్‌షోలో భాగంగా మంత్రి ఆదిమూలపు సురేశ్‌ కార్యాలయం వద్దకు వచ్చిన చంద్రబాబు… ఖబడ్దార్‌ అంటూ మంత్రిని హెచ్చరించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు పశ్చిమ ప్రాంతం లో పర్యటన విజయవంతమైందని, ఓర్వలేక ఇలాంటి చిల్లర రాజకీయాలకు వైసీపీ బరి తెగించిందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకు లు, కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరోపక్క యర్రగొండపాలెంలో జోరు వర్షం కురుస్తున్నా చంద్రబాబు రోడ్‌ షో కొనసాగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img