రష్యా తయారీ స్పుత్నిక్, ఆక్స్ఫర్డ్- ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ డోసుల మిక్సింగ్‌కు అనుమతి మంజూరు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తి పెంపునకై వ్యాక్సిన్ల మిక్సింగ్ ప్రక్రియపై కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చర్యలు తీసుకుంటోంది. స్పుత్నిక్, కోవిషీల్డ్ రెండు డోసులు కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవని గత పరిశోధనల్లో తేలింది.వ్యాక్సిన్ మిక్సింగ్‌కు కేంద్రం అనుమతి ఇస్తే టీకాను ప్రజలే ఎంచుకోవచ్చు.