Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

27న బంద్‌ జయప్రదం చేయండి

ప్రభుత్వ రంగాన్ని అంబానీ, అదానీలకు తాకట్టుపెడుతున్న మోదీ
సీపీఐ జన ఆందోళన పాదయాత్రలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర`ఒంగోలు : కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో పాలన సాగిస్తున్న ఎన్డీయే ప్రభుత్వం కార్పొ రేట్లకు దేశాన్ని గంపగుత్తంగా దోచిపెడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. మోదీ ప్రభు త్వ ప్రజా వ్యతిరేక విధానాలకు, ప్రభుత్వ ఆస్తులను కార్పొరే ట్‌ శక్తులకు కట్టబెట్టటానికి నిరసనగా, రైతాంగ వ్యతిరేక విధానానికి నిరసనగా రాష్ట్రంలో సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి చేపట్టిన జన్‌ఆందోళన పాదయాత్ర ప్రచార కార్యక్రమం ఆదివారం ప్రకాశం జిల్లాలో ప్రవేశించింది. ఒంగోలులోని కర్నూల్‌ రోడ్డు ఫ్లైఓవర్‌ వద్ద నుండి ఆర్టీసి డిపో, అద్దంకి బస్టాండ్‌ , ట్రంకురోడ్డు మీదుగా కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో జవహర్‌లల్‌ నెహ్రూ ప్రధానిగా ఉన్న నాటి నుండి నేటి వరకు కార్మికులు, కష్టజీవులు,ఇతర శ్రమ జీవులు కష్టించి కూడబెట్టి అభివృద్ది చేసిన ప్రభుత్వ రంగ సంస్ధలను కొద్ది మంది కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబానీ, ఆదానీల ఆస్తులను పెంచటమే పరమావధిగా ప్రధాని పనిచేస్తున్నారన్నారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్‌పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కృష్ణ పట్నం పోర్టును, గంగవరం పోర్టులను ఆదానీకి ఇచ్చారన్నారు. మొత్తగా దేశాన్ని వారికి తాకట్టు పెడుతున్నారనీ, ఇందుకు వ్యతిరేకంగా ప్రజాందో ళన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 60శాతం గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవనాధారమైన వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్లకు అప్పగించి వారి కడుపుకొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందన్నారు. దానికి వ్యతిరేకంగా దేశంలో 10 మాసాలుగా చరిత్రాత్మక పోరాటం జరుగుతోందన్నారు. ఈ నెల 27న 500 రైతు సంఘాలు, 400 కార్మిక సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌లో ప్రజలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి ప్రజల సమస్యలు పట్టడంలేదని, వ్యక్తిగత దూషణలతో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల గురించి, వారి సమస్యల గురించి మాట్లాడాలని, ప్రజల ఆస్తుల గురించి ఆలోచనలు చేయాలని హితవు పలికారు. ఇప్పటికైనా జగన్‌, చంద్రబాబు భారత్‌ బంద్‌కు మద్దతు తెలపాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీి రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ రవీంద్రనాథ్‌్‌ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోడ్‌లు గా మార్చి కార్మికులను దేశంలో యాజమాన్యాలకు కట్టుబానిసలుగా మారుస్తోందన్నారు. ప్రాణ త్యాగాలతో, ప్రజాప్రతినిధుల రాజీనామాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయటం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్‌ వెంకట్రావు, వడ్డే హనుమారెడ్డి, అందే నాసరయ్య, మాలకొండయ్య, ఏఐటీయూసీిి జిల్లా అధ్యక్ష్య, పధాన కార్యదర్శులు సురేష్‌ పీవీఆర్‌ చౌదరి, నగర కార్యదర్శి ఎస్‌డి సర్ధార్‌, వీరారెడ్డి, ఉప్పుటూరి ప్రకాశరావు, డి శ్రీనివాస్‌, జీవరత్నం, శింగరకొండ, కె అంజయ్య బి హరికృష్ణ, సుభాన్‌ నాయుడు, అంజయ్య, బాలిరెడ్డి, చట్లా లక్ష్మీ, శ్యామేలు, దాసు, మల్లికార్జున, కాశీం, మౌలాలీ, చినిగే సుబ్బారావు, కైలా అజయ్‌, కల్లు లక్ష్మయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img