Monday, March 27, 2023
Monday, March 27, 2023

34 వేలు దాటిన మృతులు.. మరోసారి 4.7 తీవ్రతతో టర్కీలో భూకంపం

టర్కీపై భూకంపం పగబట్టినట్టుంది. మరోసారి ఆ దేశంలో భూకంపం సంభవించింది. రియాక్టర్‌ స్కేల్‌పై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. దక్షిణ టర్కీ నగరమైన కహ్రామన్‌మరాస్‌కు సమీపంలో 15.7 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు భూకంపం సంభవించినట్టు వివరించారు. ప్రకృతి విలయానికి గత వారం రోజులుగా టర్కీ వాసులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడుపుతున్నారు. భూకంపం సృష్టించిన విధ్వంసానికి ఊళ్లకు ఊళ్లే తుడుచుపెట్టుకుపోయాయి. చారిత్రక నగరాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. గత సోమవారం సంభవించిన భారీ భూకంపం కారణంగా టర్కీ, సిరియాలో ఇప్పటివరకు 34,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. టర్కీలో 29,000.. సిరియాలో 4,500 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. 92,600 మంది గాయపడ్డారు.టర్కీ, సిరియాలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ఇంకా కొనసాగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయడం లేదు. శిథిలాల నుంచి ఆరు రోజుల తర్వాత కూడా కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. తాజాగా ఆరు నెలల గర్భిణీ, ఇద్దరు పిల్లలతో సహా కొంతమంది సురక్షితంగా బయటకు వచ్చారు.అయితే, భూకంపంలో అధిక ప్రాణనష్టానికి అక్రమ నిర్మాణ కార్యకలాపాలే కారణమని టర్కీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 130 మందికిపైగా కాంట్రాక్టర్లను టర్కీ న్యాయ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు ఇక్కడి పరిస్థితులను ఆసరాగా చేసుకుని దోపిడీలకు, మోసాలకు పాల్పడుతున్న ముఠాలను కట్టడి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. భూకంపం కారణంగా కుప్పకూలిన భవనాల నిర్మాణాలకు బాధ్యులైన 134 మందిని విచారిస్తున్నట్లు టర్కీ న్యాయ శాఖ మంత్రి బెకిర్‌ బోజ్‌డాగ్‌ వెల్లడిరచినట్టు టర్కీ అధికారిక మీడియా అనడోలు తెలిపింది. వీరిలో ఏడుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. చనిపోయినవారి శవాలను ఖననం చేయడానికి భూకంప ప్రభావిత ప్రాంత శ్మశానాల్లో పెద్ద ఎత్తున బుల్డోజర్లు, పొక్లెయిన్‌లు నిరంతరం పని చేస్తుండటం ఈ విలయానికి అద్దం పడుతోంది. ఎయిర్‌ షోలో భారత వైమానిక దళ అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి కూడా పాల్గొన్నారు. ఆయన స్వయంగా యుద్ధ విమానాన్ని నడుపుతూ ‘గురుకుల్‌’ విన్యాసానికి నేతృత్వం వహించారు. ఈ షోలో భాగంగా భారతీయ విదేశీ కంపెనీల మధ్య 251 ఒప్పందాలు జరగొచ్చని అంచనా. తద్వారా భారత్‌లోకి 75 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img