Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Wednesday, October 2, 2024
Wednesday, October 2, 2024

8వ తరగతి వరకు కామన్‌ పరీక్షలు రద్దు

హైకోర్టు స్పష్టీకరణ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఎనిమిదో తరగతి వరకు కామన్‌ ఎగ్జామినేషన్‌ పరీక్షలను హైకోర్ట్‌ రద్దు చేసింది. ఈ మేరకు న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు పరీక్షలు నిర్వహించడం విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 29కి వ్యతిరేకమని పేర్కొంది. కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డుకు పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించే హక్కు లేదని దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. కేంద్ర చట్టాన్ని ఉల్లంఘిస్తూ కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు పేరిట ప్రైవేటు పాఠశా లల వద్ద లక్షల రూపాయలు వసూళ్లు చేస్తున్నారని న్యాయ వాది ముతుకుమిల్లి విజయ్‌ వాదనలు వినిపించారు. సాల్ట్‌ ప్రోగ్రామ్‌ పేరుతో ఈ పరీక్షలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని న్యాయవాది పేర్కొన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు స్వయంగా ప్రశ్నపత్రాలు తయారు చేసుకుని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని న్యాయవాది విజయ్‌ పేర్కొన్నారు. రెండు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషనర్‌ వాదనతో ఏకీభవిస్తూ 8వ తరగతి వరకు కామన్‌ పరీక్షలు రద్దు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img