Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Monday, September 30, 2024
Monday, September 30, 2024

ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం…

తొలిసారిగా నేడు సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మూడున్నర గంటల పాటు సమావేశం
సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన 5 అంశాలకు క్యాబినెట్ ఆమోదం

7 కీలక అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయం
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ తొలిసారి క్యాబినెట్ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు మూడున్నర గంటల పాటు క్యాబినెట్ భేటీ సాగింది. అజెండాలోని అన్ని అంశాలకు క్యాబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు చేసిన ఐదు అంశాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది.కాగా, క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులకు రాజకీయ అంశాలపై దిశానిర్దేశం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, హోం మంత్రి వంగలపూడి అనిత, ఇతర మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు…

మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీకి మంత్రివర్గ ఆమోదం
ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు మంత్రివర్గ ఆమోదం
ఏప్రిల్ నుంచి వర్తించేలా రూ.4 వేల పెన్షన్ పెంపునకు క్యాబినెట్ ఆమోదం… పెండింగ్ బకాయిలు కలిపి జులై 1న ఇంటివద్దే రూ.7 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం
అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గ ఆమోదం
రాష్ట్రంలో గంజాయి కట్టడికి హోంమంత్రి నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ… సభ్యుడిగా నారా లోకేశ్
7 అంశాలపై శ్వేత పత్రాల విడుదలకు మంత్రివర్గ నిర్ణయం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, లా అండ్ ఆర్డర్, పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం, మద్యం అంశాలపై శ్వేతపత్రాల విడుదల
వైద్య ఆరోగ్య యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ
పెన్షన్ల పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్పు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img