Sunday, May 12, 2024
Sunday, May 12, 2024

ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు ఎండలు..మరోవైపు వానలు

ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు ఎండలు, వేడిగాలులు వీస్తుంటే.. అక్కడక్కడా మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. నేడు 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 218 మండలాల్లో వడగాల్పులు.. గురువారం 31 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 260 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు 17 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 161 మండలాల్లో వడగాల్పులు వీచాయి. మరోవైపు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకున్నాయి. మంగళవారం అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లా వరదరాజపురంలో 45, ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.9, ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్నిప్రాంతాల్లో గరిష్ఠంగా 45నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో వానలు కూడా పడుతున్నాయి. ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. బుధవారం కూడా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, బాపట్ల, గుంటూరు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, యానాం, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయంటున్నారు. మిగిలిన జిల్లాల్లో వాతావరణం పొడిగానే ఉంటుంది.

ఏపీని కరుణించిన వరుణుడు
మరోవైపు ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎలమంచిలి, చోడవరం, మాకవరపాలెం ప్రాంతాల్లో మంగళవారం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. చెట్లు విరిగి విద్యుత్‌ తీగలు, స్తంభాలపై పడడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఉరుములు, పిడుగులతో గంట పాటు భారీ వర్షం కురిసింది. వెంటనే విద్యుత్‌ సిబ్బంది రంగంలోకి దిగి చెట్ల కొమ్మలను తొలగించారు.

ఇదిలా ఉంటే.. ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడుతూ రాత్రికి తుఫాన్‌గా మారింది. దీనికి బంగ్లాదేశ్‌ సూచించిన ాబిపర్జాయ్‌్ణ అని పేరు పెట్టారు. తుఫాన్‌ మరో తొమ్మిది రోజులు అరేబియాలో ఉత్తరంగా కొనసాగే క్రమంలో అతి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. అలాగే రుతుపవనాలు బుధవారం కేరళను తాకుతాయని భావించారు.. కానీ అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్‌ అడ్డంకిగా మారుతుందని భావిస్తున్నారు. ఈనెల 8, 9 తేదీల్లో రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి అంటున్నారు. రుతుపవనాలు ఈనెల మూడో వారంలో ఏపీలో ప్రవేశిస్తాయి అని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img