Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Sunday, September 29, 2024
Sunday, September 29, 2024

రానున్న 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు : ఐఎండి హెచ్చరిక

నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్నాటకల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.తెలంగాణలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి తెలంగాణ వైపు దూసుకుపోతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కొన్ని చోట్ల, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లో సాయంత్రం, రాత్రి వేళల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం, ఈదురు గాలులు (30 నుండి 40 కి.మీ.) వీచే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 26 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6-8 కి.మీ. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 34.9 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26.1 డిగ్రీలుగా నమోదైంది. గాలి తేమ 71 శాతంగా నమోదైంది.

ఉత్తర కోస్తాలో..
ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా ఒకటి రెండు ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలో కూడా ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img