Thursday, October 24, 2024
Thursday, October 24, 2024

జానీ మాస్టర్‌కు బెయిల్ వచ్చేసింది..

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు.. జానీ మాస్టర్‌కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే గత రెండు వారాలుగా చంచల్‌గూడా జైల్లో ఉన్నారు జానీ మాస్టర్.జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఓ యువతి.. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. బాధిత యువతి పిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు.. జానీ మాస్టర్‌పై పోక్సో చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ పరిణామం తరువాత జానీ మాస్టర్ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరికి ఆయన గోవాలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img