Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

భారత తొలి బౌలర్‌గా కుల్దీప్‌ అరుదైన రికార్డు


ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం ఆఖరి టెస్టులో టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కుల్‌దీప్‌ బెన్‌ డకెట్‌(27), జాక్‌ క్రాలే(79), ఒలీ పోప్‌(11), జానీ బెయిర్‌ స్టో(29), బెన్‌ స్టోక్స్‌(0)లను కూడా అవుట్‌ చేశాడు. ఈ క్రమంలో కుల్దీప్‌ యాదవ్‌ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌ తరఫున తక్కువ బంతుల్లోనే 50 టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌లను ఈ చైనామన్‌ బౌలర్‌ అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 275 వికెట్ల మైలురాయిని అందుకున్న కుల్దీప్‌ యాదవ్‌.. ఈ మార్కుకు చేరుకున్న పదిహేడో భారత బౌలర్‌గా నిలిచాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img