Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మోదీని, జగన్‌ను సాగనంపుదాం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర-శింగనమల : దేశంలో కుల, మతాల మధ్య చిచ్చు రేపుతూ ప్రజల్లో అశాంతిని నెలకొల్పుతున్న మోదీని, ఎన్నికల హామీలు మరచిన జగన్‌ను ఇంటికి సాగనంపుదామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం అనంతపురం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగిన న్యాయ సాధన సభకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్‌ షర్మిల, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీశ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సభను ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి రైతులను అణగదొక్కే చర్యలకు పాల్పడుతోందన్నారు. రైతులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా పోరాటాలు చేస్తుంటే ఉద్యమాన్ని అణచివేసేందుకు కాల్పులు జరిపి రైతులను పొట్టన పెట్టుకున్న ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని ధ్వజమెత్తారు. అంబాని, అదానీలు చేసిన వేల కోట్ల అప్పులను మాఫీ చేస్తూ, పేద ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నాడని విమర్శించారు. రైతులు పంటలు పండక, కొద్దో గొప్పో తీసుకున్న రుణాలను బ్యాంకుల్లో కట్టకపోతే బ్యాంకు సిబ్బంది రైతులను బెదిరిస్తూ ఏడిపిస్తూ కట్టించుకుటున్నారని తెలిపారు. మోదీ అధికారం కోసం వెంపర్లాడుతున్నాడని, ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి నిలువునా మోసం చేశాడన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 2019 ఎన్నికల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ తెస్తానని, స్టీల్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తానంటూ అనేక హామీలతో అధికారంలోకి వచ్చాడని, ఆ తరువాత హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండరు విడుదల చేస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న హామీ ఏమైందని రామకృష్ణ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి రావలసిన వాటాను తీసుకురాకుండా, ప్రశ్నిస్తే ఇబ్బందులు వస్తాయేమోనన్న భయంతో జగన్‌ ఉన్నాడని తెలిపారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు కలిసొచ్చే పార్టీలను కలుపుకొని ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేశామని, ఇప్పుడు నీ భరతం పట్టేందుకు ప్రజలందరూ సన్నద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో మోదీకి, సీఎం జగన్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు పాల్యం నారాయణస్వామి, చిరుతల మల్లికార్జున, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img