దేశంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈసారి 100 సీట్ల మార్కును దాటింది. నేడు వెలువడుతున్న లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 100కు పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో 2014 తర్వాత కాంగ్రెస్ అత్యధిక స్ధానాలు సాధించినట్లు లెక్క..! కేరళలోని వయనాడ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 1,20,206 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన పోటీ చేస్తున్న మరో స్థానం రాయ్ బరేలీ (యుపి) లో బిజెపి అభ్యర్థి పై 68,789 ఓట్ల మెజారిటీతో ముందంజలో దూసుకుపోతున్నారు. అమేఠీలో కాంగ్రెస్ నేత కిశోరీ లాల్ శర్మ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై 23,428 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.