Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కాషాయ ఉచ్చులో గిలగిల

. బీజేపీ కోర్టులో ‘పొతు’్త బంతి
. సీట్ల సర్దుబాటుపై హస్తినదే ఫైనల్‌
. టీడీపీ, జనసేన నేతల్లో గందరగోళం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : టీడీపీ, జనసేన కూటమి బంతి ఇప్పుడు బీజేపీ కోర్టులో పడిరది. ఇక ఆ బాలు ఆ పార్టీల కోర్టుకు ఎప్పుడు చేరుతుందో దిల్లీ పెద్దల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంది. పొత్తుల వ్యవహారం టీడీపీ, జనసేన పార్టీల్లో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న నేతలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఎన్ని సీట్లు, ఏఏ నియోజకవర్గాలు కేటా యిస్తారో అర్థంగాక… ఇప్పటివరకు తెలుగు తమ్ముళ్లు టెన్షన్‌ పడుతుండగా, తాజాగా చంద్రబాబు దిల్లీలో బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డాలతో భేటీతో మారిన రాజకీయ సమీకరణలు వారిని మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కి వస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఎకనామిక్‌ టైమ్స్‌ సదస్సులో తాజాగా వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని అంటూనే… త్వరలోనే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని అమిత్‌ షా చెప్పడం కొసమెరుపు. కుటుంబపరంగా ఫ్యామిలీ ప్లానింగ్‌ బావుంటుంది కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నట్లు అమిత్‌షా వ్యాఖ్యానించారు. అలాగే తమ మిత్రులను తామెప్పుడూ బయటకు పంపించలేదని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజ కీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బయటకు వెళ్లి ఉండవచ్చని అమిత్‌ షా అన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అమిత్‌షా, నడ్డాలు చంద్రబాబుతో భేటీ సందర్భంగా భారీ సంఖ్యలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కావాలని కోరినట్లు సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. కేంద్ర సహకారం కావాలంటే, తమకు దక్షిణాదిన గౌరవ ప్రదమైన ఎంపీల సంఖ్య అవసరమని, అందువల్ల ఎంపీ సీట్లు ఎక్కువగా కేటాయించక తప్పదని వారు గట్టిగానే ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. కనీసం 20 శాసనసభ స్థానాలు బీజేపీకి ఇవ్వాలని కోరినట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు దిల్లీ వెళ్లిన మరుసటి రోజే సీఎం జగన్‌ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఇది కూడా రాజకీయ భేటీగానే రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కూడా రాష్ట్రంలో మరలా అధికారంలోకి రావాలన్నా, తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల ఇబ్బందులను అధిగమించాలన్నా… బీజేపీ పెద్దల సహకారం తప్పనిసరని బలంగా అభిప్రాయపడుతు న్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ కేంద్రంలో బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఆయన బలంగా నమ్ము తున్నారు. దీంతో కేంద్రానికి గతంలో వలే వైసీపీ పరోక్ష మద్దతు కొనసాగుతుందని ప్రధాని మోదీకి జగన్‌ హామీ ఇచ్చి తనను ఆశీర్వదించాలని కోరినట్లు తెల్సింది. మరోపక్క టీడీపీ, జనసేన కూటమిని రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా నివారించేందుకు… మనమే బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందనేది వైసీపీ ముఖ్యనేతల్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలను బట్టి ఇక ఈ మూడు పార్టీల సీట్ల సర్దుబాటు వ్యవహారం దిల్లీ పెద్దల చేతికి చిక్కినట్లుగానే భావిస్తున్నారు. ఏపీకి చెందిన బీజేపీ ముఖ్యనేతలందరికీ పొత్తులో భాగంగా ఎంపీ సీట్లు తీసుకునేలా దిల్లీ పెద్దలు తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి పెంచుతున్నారు. చివరకు వారికి ఏ నియోజకవర్గాలు కావాలో కూడా బీజేపీ నేతలే నిర్ణయించే పరిస్థితి కనపడుతోంది. దీంతో ఇప్పటివరకు ఆయా నియోజకవర్గాల్లో పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతూ పోటీ చేసేందుకు సిద్ధపడిన టీడీపీ నేతలకు తలనొప్పిగా మారింది. పొత్తులో భాగంగా తమకు కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్న జనసేన నేతలు కూడా ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో అయోమ యానికి లోనవుతున్నారు. మొత్తానికి రాజకీయ విశ్లేషకులు ఊహించినట్లుగానే కమలనాథుల ఉచ్చులో పడిన టీడీపీ, జనసేన నేతలు గిలగిలా కొట్టుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img