Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

రేపు ట్రాక్టర్‌ ర్యాలీలు

దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం
. డబ్ల్యూటీఓ, మంత్రుల దిష్టిబొమ్మల దహనాలు
. 29 వరకు ‘దిల్లీ చలో’కు విరామం
. అదే రోజు భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం
. అప్పటివరకు సరిహద్దుల వద్దే ఆందోళనలు
. ఎస్‌కేఎం, కేఎంఎం నాయకుల ప్రకటన

న్యూదిల్లీ : తమ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే కాకుండా దానిని ఉధృతం చేయడం ద్వారా కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకు రైతులు నడుం బిగించారు. ఇదే క్రమంలో తమ డిమాండ్ల సాధన కోసం దశలవారీ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సోమవారం ట్రాక్టర్‌ ర్యాలీలకు సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా రహదారులను దిగ్బంధించాలని, డబ్ల్యూటీఓ, మంత్రుల దిష్టిబొమ్మలు దహనం చేయాలని రైతాంగానికి సూచించింది. ఈనెల 29న ఉద్యమ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపింది. అప్పటివరకు సరిహద్దులకే పరిమితం కావాలని, అక్కడే ఆందోళనలు కొనసాగించాలని సూచించింది. భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం జరిగేంత వరకు రైతులు పంజాబ్‌`హర్యానా సరిహద్దు, శంభు, ఖనౌరీకి పరిమితం అవుతారని, అక్కడే తమ నిరసనలు కొనసాగిస్తారని రైతు నాయకులు వెల్లడిరచారు. ఈనెల 29 వరకు దిల్లీ చలో మార్చ్‌కు విరామాన్ని ప్రకటించారు. అదే రోజు భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. యువ రైతు శుభకరణ్‌ మృతికి నిరసనగా శనివారం కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. తమ డిమాండ్ల సాధన కోసం 26వ తేదీన దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం, ట్రాక్టర్‌ ర్యాలీలు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. అదే రోజు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ), మంత్రుల దిష్టిబొమ్మల దహనాల ద్వారా నిరసన, ఆగ్రహాన్ని వ్యక్తం చేయనున్నట్లు వెల్లడిరచారు. విరామిచ్చిన రెండు రోజులు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా (కేఎంఎం) మధ్య చర్చలు, సమావేశాలు జరపనున్నట్లు నాయకులు తెలిపారు. శుక్రవారం బ్లాక్‌ డే విజయవంతం అయినట్లు ప్రకటించారు. మార్చి 14న దిల్లీలోని రాంలీలా మైదానంలో మహాపంచాయత్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం శంభు వద్ద హర్యానా పోలీసులతో పంజాబ్‌ రైతులకు జరిగిన ఘర్షణలో శుభకరణ్‌ సింగ్‌ (22) చనిపోగా మరో 12 మంది రైతులు గాయపడ్డారు. దీంతో దిల్లీ చలోకు విరామాన్ని రైతులు ప్రకటించారు. ఇదిలావుంటే నిరసనల వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎలాంటి నష్టం జరిగినా అందుకే రైతులే బాధ్యతలు అవుతారని, వారే మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని హర్యానా, అంబాలా జిల్లా పోలీసులు పేర్కొన్నారు. జరిగిన నష్టాన్ని బట్టి నిరసన కారుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను సీజ్‌కు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎస్‌కేఎం, కేఎంఎంతో పాటు 200కుపైగా రైతు సంఘాలు ‘దిల్లీ చలో’ను పెద్దఎత్తున సాగిస్తున్నాయి. ఎంఎస్పీకి చట్టబద్ధమైన హామీ, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, రైతులకు రుణమాఫీ, పింఛన్‌, లఖింపూర్‌ ఖేరి బాధితులకు న్యాయం, రైతు లపై పోలీసు కేసుల ఉపసంహరణ, విద్యుత్‌ టారిఫ్‌ పెంపుదల వద్దంటూ డిమాండ్‌ చేస్తున్నాయి. 2020`21 ఆందోళనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు సముచిత పరిహారాన్ని కోరుతున్నాయి. రైతుల ఆందోళనతో ఈనెల 11 నుంచి 21వ తేదీ వరకు హర్యానాలోని అనేక జిల్లాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌, ఎస్‌ఎంఎస్‌ సేవలను ఆ రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఆపై దానిని 24వ తేదీ వరకు పొడిగించింది. విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img