Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అధ్యక్ష పాలన దిశగా దేశం

. మోదీ సర్కారు నియంతృత్వ పోకడలు
. బీజేపీ కబంధ హస్తాల నుంచి దేశాన్ని కాపాడుకుందాం
. ప్రజాస్వామ్య, లౌకికశక్తులు ఒక్కటవ్వాలి
. సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో రాజా పిలుపు

విశాలాంధ్రహైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నారని, ఏకస్వామ్య ఫాసిస్టు, నియంతృత్వ వ్యవస్థ కోసం ప్రయత్నిస్తున్నారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. అధ్యక్ష తరహా పరిపాలన దిశగానే మోదీ అడుగులేస్తున్నారని, అందుకే ఒకే దేశంఒకే ఎన్నిక నినాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని మండిపడ్డారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం నుండి దేశానికి విముక్తి కల్పించడమే తమ ముందున్న లక్ష్యమని రాజా స్పష్టంచేశారు. మరోసారి మోదీ అధికారంలోకి వస్తే దేశ భవిష్యత్తు ఏమవుతుందోననే భయం కలుగుతోందన్నారు. అందుకే విపక్ష ఇండియా కూటమిలో సీపీఐ భాగస్వామిగా ఉన్నదని చెప్పారు. భారతదేశాన్ని రక్షించేందుకు ‘దేశ్‌ బచావో` బీజేపీ హఠావో నినాదాన్ని ఇండియా కూటమి ముందుకు తెచ్చిందని వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లో లౌకిక, ప్రజాస్వామ్య విలువలతో పనిచేసే రాజకీయ పార్టీలు గెలవాల్సిన అవసరం ఉందని రాజా చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే సీపీఐ జాతీయ సమితి సమావేశాలు హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్దుంభవన్‌లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. సీపీఐ నేతలు రామకృష్ణ పాండా, కూనంనేని సాంబశివరావు, నిషా సిద్ధూ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. డి.రాజా ప్రారంభోపన్యాసం చేస్తూ భారతదేశం ప్రజాస్వామిక, లౌకిక, గణతంత్ర దేశంగా కొనసాగుతుందా లేక ఫాసిస్టు, నియంతృత్వ దేశంగా ఉండబోతుందా అనే సందేహాలు కలుగుతున్నాయన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితులలో జరిగే జాతీయ సమితి సమావేశాలలో తాజా రాజకీయాలతో పాటు బీజేపీని ఓడిరచడం కోసం లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలిపారు. బీజేపీని అధికారానికి దూరం చేయడం ఓ సవాలుగా మారిందని, ఈ సవాలును లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు, శక్తులు ధైర్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని రాజా సూచించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుండి దేశానికి విముక్తి కలిగించాలని, ఇందుకోసం వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక పార్టీలు ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్పొరేట్‌ కంపెనీలకు ఊడిగం
కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో పేదలకు ఒరిగిందేమీ లేదని రాజా అన్నారు. కార్పొరేట్‌ సంస్థలను పెంచి పోషించడమే లక్ష్యంగా మోదీ సర్కారు పనిచేస్తోందని, అందులో భాగంగా కార్పొరేట్‌ సంస్థలకు సంబంధించిన పన్నులను 32 శాతం నుండి 27 శాతానికి తగ్గించిందని రాజా విమర్శించారు. మోదీ ప్రభుత్వం ఎవరి పక్షమో ఇది రుజువు చేస్తోందన్నారు. సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌..సబ్‌ కా వికాస్‌, సబ్‌ ప్రయాస్‌… అన్నీ సబ్‌ అంటుందని, కానీ వాస్తవ పరిస్థితుల్లో ఏమి జరుగుతుందో అందరికీ తెలుసుని అన్నారు. యువత, మహిళలు, రైతులు, పేదలపై దృష్టి పెట్టామని కేంద్రం కల్లబొల్లి కబుర్లు చెబుతోందని, ఆచరణలో ఈ వర్గాలకు చేసిందేమీ లేదని విమర్శించారు. యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిచ్చారా? రైతుల ఆదాయం రెట్టింపు చేశారా? మహిళలపై అత్యాచారాలు, దారుణాలు అరికట్టారా అని నిలదీశారు. తాము అధికారంలోకి వస్తే దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తానని మోదీ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని, కానీ ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్న విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పేదలను పట్టించుకోని మోదీ ప్రభుత్వం బడా కార్పొరేట్‌ కంపెనీలకు మాత్రం ఊడిగం చేస్తోందని రాజా విమర్శించారు. అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతోందని, పదేళ్లుగా మోదీ సర్కారు వారి కోసమే పని చేస్తోందన్నారు. మోదీ పాలనలో యువత భవిష్యత్‌ అంధకారంగా మారిందన్నారు. 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నదని, కానీ అంతర్జాతీయ ఆకలి సూచీలో భారతదేశం 111వ స్థానంలో ఉన్న విషయాన్ని విస్మరిస్తున్నారని చెప్పారు.
రాముడి పేరుతో బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నదని, మోదీ చెబుతున్న రాముడికీ… గాంధీ చెప్పే రాముడికీ చాలా తేడా ఉన్నదని రాజా చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఎంతమంది విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేశారో అందరికీ తెలుసునన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉన్నతమైనదని, దానిని మోదీ సర్కారు కాలరాస్తోందని విమర్శించారు. ప్రభుత్వ తప్పొప్పులను ఎత్తిచూపడమే ప్రతిపక్షం బాధ్యతని, అలా చేయకపోతే ప్రజాస్వామ్యానికి మనుగడే ఉండదని చెప్పారు. స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన సీపీఐకి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన బాధ్యత ఉన్నదన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఎలాంటి పాత్ర లేని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కబంధ హస్తాల నుండి దేశాన్ని కమ్యూనిస్టులు విముక్తి చేయాలని రాజా పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img