Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అవినీతి చక్రవర్తి కేసీఆర్‌

. దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకం
. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం
. వరంగల్‌ సభలో ప్రధాని మోదీ

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : కేసీఆర్‌ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్రమోదీ ఎదురుదాడి చేశారు. కేసీఆర్‌ది అత్యంత అవినీతి ప్రభుత్వమని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యువతను, విద్యార్థులను పూర్తిగా విస్మరించిందని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఇతోధికంగా సాయమందించిందని చెప్పుకొచ్చారు. గడిచిన 9 ఏళ్లలో దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందని మోదీ అన్నారు. ముఖ్యంగా ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ చాలా కీలకంగా పనిచేసిందన్నారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసేందుకు వచ్చిన మోదీ… శనివారం హన్మకొండ ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో ప్రసంగించారు. ముందుగా తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభిస్తూ ప్రజలను అకట్టుకునే ప్రయత్నం చేశారు. దేశానికి ఇది స్వర్ణ సమయమని, రూ.6వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇప్పుడు ప్రారంభించుకుంటున్నామని మోదీ వివరించారు. దేశాభివృద్ధి కోసం శరవేగంగా పనులు పూర్తిచేస్తున్నామని, ఆనేక ఆర్థిక కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రియల్‌-ఎకనామిక్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలున్నాయన్నారు. కరీంనగర్‌ గ్రానైట్‌ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నామని, తెలంగాణలో రైల్వే రహదారుల కనెక్టివిటీ పెంచుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తోందన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారని తెలిపారు. తెలంగాణ ముందు అపార అవకాశాలు ఉన్నాయని, నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం గడిచిన 9 ఏళ్ల నుంచి ఎంతో కృషి చేస్తున్నామని వెల్లడిరచారు. కొత్త లక్ష్యాల కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని అన్నారు. లాజిస్టిక్స్‌ సదుపాయం లేకపోతే వ్యాపారాలు నష్టపోతాయని తెలిపారు. రాష్ట్రంలో 2500 కిమీ పొడవు ఉన్న జాతీయ రహదారులు… ఇప్పుడు 5 వేల కిలో మీటర్లకు పెరిగాయని చెప్పారు.
అవినీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మించిన వారు లేరని ప్రధాని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం అంటే అత్యంత అవినీతి ప్రభుత్వమని, వారి అవినీతి దిల్లీకి పాకిందని ప్రధాని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్ష్యమన్నారు. కేసీఆర్‌ కుటుంబం కుంభకోణాల్లో ఇరుక్కుందని, కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటిని వెలికితీసే పనిలో పడ్డాయని బెదిరించారు. భద్రకాళి అమ్మవారి మహత్యానికి, సమ్మక్క-సారలమ్మ శౌర్యానికి, రాణి రుద్రమ పరాక్రమానికి నిదర్శనమైన వరంగల్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. జనసంఫ్‌ు కాలం నుంచి ఈ ప్రాంతం తమ భావజాలానికి బలమైన కోటగా ఉందని చెప్పారు. తన ప్రసంగంలో కేసీఆర్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కుటుంబ పాలన, అవినీతి ప్రభుత్వం అంటూ పదే పదే వక్కాణించారు. దేశంలో కుటుంబ పార్టీలన్నింటికీ అవినీతి పునాది ఉందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషించిందని మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వం కేవలం నాలుగు పనులు మాత్రమే చేసిందని చెబుతూ…ఉదయం, సాయంత్రం మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని దుర్భాషలాడటం, ఒక కుటుంబాన్ని అధికార కేంద్రీకృతం చేసి తెలంగాణకు వారే యజమాని అని నిరూపించుకోవడం, తెలంగాణ ఆర్థికాభివృద్ధిని అడ్డుకోవడం, తెలంగాణను అవినీతిలో ముంచడం అంటూ విరుచుకుపడ్డారు. ఈ 9 సంవత్సరాలలో ప్రపంచంలోనే భారతదేశం గర్వం పెరిగిందన్నారు. అందరూ భారతదేశం వైపు చూస్తున్నారని, దీనివల్ల తెలంగాణ కూడా లాభపడిరదని తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. అభివృద్ది కోసం రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని, అవినీతి కోసం దిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. ఇందుకోసమేనా తెలంగాణ యువత ఆత్మబలిదానాలు చేసిందని ప్రశ్నించారు. అవినీతి నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నాలు కేసీఆర్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని అన్నారు. టీఎస్‌పీఎస్సీ స్కామ్‌తో యువత ఎంతో నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్‌ అయినా, బీఆర్‌ఎస్‌ అయినా తెలంగాణ ప్రజలకు రెండూ ప్రాణాంతకమేనన్నారు. ఈ రెండిరటి నుంచి తెలంగాణ ప్రజలను కాపాడాలని కోరారు. తెలంగాణ వర్సిటీల్లో మూడువేల అధ్యాపక పోస్టులు భర్తీ చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో 15 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతి ఇవ్వలేదని అన్నారు. 9 ఏళ్లలో కేంద్రం గ్రామపంచాయతీలకు లక్ష కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని చెప్పారు. ఆ నిధులను తెలంగాణ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నదని విమర్శించారు. తాము రైతుల పంటకు మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చి చేసి చూపించామని తెలిపారు. తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఇచ్చామని, కేసీఆర్‌ ప్రభుత్వం మాత్రం ఎస్సీ, ఎస్టీ, పేదలను మోసం చేసిందని విమర్శించారు. ఆదివాసీ గ్రామాలకు ఎలాంటి మౌలిక సౌకర్యం కల్పించడం లేదని మండిపడ్డారు. సభకు వచ్చిన జనాన్ని చూస్తే హైదరాబాద్‌లో కొందరికి నిద్రపట్టదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ తొలుత సాధించిన రెండు లోక్‌సభ సీట్లలో ఒకటి హన్మకొండ అని గుర్తు చేశారు. ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందన్నారు.
2021 మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బీజేపీ ట్రైలర్‌ చూపించిందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లను అడ్రస్‌ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img