Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

‘ఎస్‌బీఐ’ కేసులో11న సుప్రీం విచారణ

న్యూదిల్లీ: ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడిరచేందుకు మరింత గడువు కోరుతూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల11న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడిరచాలని ఎస్‌బీఐకు కోర్టు 6వతేదీ వరకు గడువు ఇచ్చింది. కానీ ఆ తేదీలోగా వివరాలను ఎస్‌బీఐ వెల్లడిరచలేదు.
దాతల వివరాలు వెల్లడిరచేందుకు జూన్‌ 30 వరకు గడువును కోరింది. దీనిపై 11వ తేదీన అనగా సోమవారం సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వ ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టబోతోంది. కోర్టు ఆదేశాలను ఎస్‌బీఐ ధిక్కరించినట్లు దాఖలైన పిటిషన్‌ను అదే రోజు విచారించనున్నది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం గతనెలలో తీర్పుఇచ్చింది. వాటిని రద్దు చేయాలని ఆదేశాలిచ్చింది. 2019 ఏప్రిల్‌ 12 నుంచి కొనుగోలు చేసిన బాండ్ల వివరాలను ఈనెల 6లోపు ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఎస్‌బీఐకి… వాటిని ఈనెల 13వ తేదీ నాటికి వెబ్‌సైట్‌లో ఉంచాలని ఈసీకి ఆదేశాలు జారీచేసింది. ఈనేపథ్యంలో బాండ్ల వివరాలను వెల్లడిరచేందుకు జూన్‌ 30 వరకు గడువు కావాలని సుప్రీంకోర్టును ఎస్‌బీఐ కోరింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌).. ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించడంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని, తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు దాతల వివరాలు, విరాళాల మొత్తాన్ని ప్రజలకు వెల్లడిరచరాదనే ఎస్‌బీఐ గడువు కోరుతున్నట్లు ఆరోపించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img