Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఖరీఫ్‌ సాగేనా ?

. జులై వచ్చినా అదను కాని పొలాలు
. వానాకాలంలోనూ తగ్గని ఉష్ణోగ్రతలు
. తాజా వర్ష సూచనతో రైతుల్లో ఆశలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: జులై వచ్చినా పంటల సాగుకు సరిపడా వర్షాలు లేవు. ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఈ ఏడాది ఖరీఫ్‌ పంటలు సాగు సాధ్యమేనా? అనే పరిస్థితి నెలకొంది. రైతన్న నెల రోజులుగా ఆకాశం వైపు చూస్తూ ఏరోజుకారోజు వీడుతున్న మబ్బులు చూసి నీరసపడుతున్నాడు. తొలకరి జల్లులు మినహా ఏ జిల్లాలోనూ భారీ వర్షం కురిసిన దాఖలా లేదు. ఏప్రిల్‌ నుంచి ఎండలు మండుతున్నాయి. వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం సహజమే కానీ జూన్‌, జులై నెలల్లో కూడా ఎండ తీవ్రత అదే స్థాయిలో ఉండటంతో ఖరీఫ్‌ సాగుపై నీలినీడలు అలుముకున్నాయి. సాధారణంగా రోహిణీకార్తె ప్రారంభమైన తర్వాత వర్షాలు కురవడం, నువ్వులు, పెసర, అపరాలు వంటి పునాస పంటలు సాగు చేస్తారు. కానీ ఈ ఏడాది పునాస సాగు మచ్చుకైనా కానరావడం లేదు. అక్కడక్కడా కొద్ది మేర సాగు చేసినా ఆ పంటలను బతికించుకోవడం కష్టంగా మారింది. రాష్ట్రంలో ఐఎండీ నివేదిక ప్రకారం జూన్‌లో 37శాతం వర్షలోటు నమోదైంది. ఫలితంగా జూన్‌లో ఖరీఫ్‌ సాగు ఐదు శాతానికి మించలేదు. వర్షాభావ పరిస్థితులను అంచనా వేసిన వ్యవసాయశాఖ ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు లక్ష్యాన్ని భారీగా తగ్గించింది. గతేడాది 96.41లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు లక్ష్యంగా పెట్టుకోగా, దానిని ఈ సంవత్సరం 89.37లక్షల ఎకరాలకు కుదించింది. జూన్‌ నెలాఖరుకు ఎనిమిది లక్షల ఎకరాలు సాగులోకి రావాల్సి ఉండగా, ఇప్పటికి 3.95లక్షల ఎకరాల్లోనే విత్తనం పడిరది. సాధారణ విస్తీర్ణంలో సగం కూడా విత్తనం పడకపోవడం వల్ల ఖరీఫ్‌ సాగు, దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం రాయలసీమలో 27శాతం, కోస్తాంధ్రలో 37శాతం వర్షలోటు నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సగటు వర్షపాతానికి సగానికిపైగా వర్షలోటు ఉండగా, మిగిలిన జిల్లాల్లో 30శాతానికిపైగా ఉంది. కోనసీమ, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, బాపట్ల జిల్లాల్లో వర్షపాతం కాస్త మెరుగ్గా ఉంది. నాలుగు నెలల ఖరీఫ్‌ సీజన్‌లో ఆలస్యమనుకున్నా నెల రోజులు గడిచిపోయాయి. రానున్న రోజుల్లో సమృద్ధిగా వర్షాలు కురిస్తే ఖరీఫ్‌ పంట కొంతైనా పండిరచే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా నాలుగు శాతం లోటు వర్షపాతం నమోదవుతుందన్న అంచనాతో వర్షాలు తక్కువగా కురిసే ప్రాంతాల్లో పంటలు వేసేందుకు అన్నదాతలు వెనుకాడుతున్నారు. వ్యవసాయాధికారులు మాత్రం మరో నెల వర్షపాతం నివేదికల్ని చూసిన తర్వాతగానీ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ప్రకటించలేమని చెపుతున్నారు. ఇలాంటి సమయంలో అమరావతి వాతావరణ కేంద్రం జారీ చేసిన తాజా వర్ష సూచన రైతుల్లో ఆశలను చిగురింపజేస్తోంది. ఏపీతో పాటు, కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో ట్రోపో ఆవరణంలో పడమటి గాలులు వీస్తున్న కారణంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో మూడు రోజులపాటు మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30కిమీల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వాటి ప్రభావమున్న ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వెల్లడిరచింది. దీంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వర్షాలు పడితే ఎండ తీవ్రత తగ్గుతుందని, పొలాలు అదనైతే విత్తనాలు ఎద పెట్టుకోవచ్చని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img