Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

చిగురించిన ఆశలు

. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు
. ఖరీఫ్‌ సాగుకు రైతన్నల సన్నద్ధం
. నీటి విడుదల కోసం ఎదురుచూపు

పుష్కలంగా వర్షాలు కురవకపోవడం… చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల్లో నీరు అడుగంటడంతో కడప, కర్నూలు జిల్లాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ తరుణంలో ఇటీవలి భారీవర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరడంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. ఆలస్యమైనా కేసీ కెనాల్‌, తెలుగుగంగ ఆయకట్టు రైతులు వరిసాగుకు శ్రీకారం చుట్టేందుకు సమాయత్తమయ్యారు. అధికారులు, పాలకులు తక్షణమే నీటి విడుదలకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే రోజుల వ్యవధిలోనే నాట్లువేసే అవకాశం ఉంది.

విశాలాంధ్ర- కడప బ్యూరో: రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, సాగునీటి ప్రాజెక్టులు నీరులేక వెలవెలబోవడం, సీమ ప్రాజెక్టులకు ప్రాణ ప్రధానమైన శ్రీశైలం జలాశయంలో నీరు అడుగంటడంతో ఆందోళన చెందుతున్న కేసీ కెనాల్‌, తెలుగుగంగ ఆయకట్టు రైతాంగం… భారీ వర్షాల నేపథ్యంలో ఆశలు చిగురిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు శ్రీశైలం జలాశయానికి నీరు చేరుతుందా అన్న సందేహాలు ఏర్పడిన తరుణంలో గత వారం రోజులుగా ప్రాజెక్టుకు క్రమక్రమంగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నీటిమట్టం 860 అడుగులకు చేరింది. 841 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీరు ఇవ్వాలి. రెండు రోజుల్లో భారీగా వరద నీరు పెరగడంతో నిబంధనల ప్రకారం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. మరో మూడు నాలుగు రోజుల్లో నీటిని విడుదల చేస్తారన్న నమ్మకంతో కడప, కర్నూలు జిల్లాల రైతాంగం ఉంది.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతుండడంతో శుక్రవారంనాటికి 2,46,965 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం దిగువ ప్రాంతానికి 31,748 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో భారీగా ఉండడంతో శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయికి నీటిమట్టం త్వరగా చేరుకునే అవకాశాలున్నాయి. కడప, కర్నూలు జిల్లాల్లో ప్రధాన సాగునీటికి ఆధారమైన కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రాజకీయ నాయకులు నీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతోపాటు మరో ప్రధాన సాగు నీటి వనరు అయిన తెలుగు గంగ ప్రాజెక్టుకు నీరు విడుదల చేయాల్సిఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కింద రిజర్వాయర్‌లు అడుగంటేపరిస్థితికి వచ్చాయి. పోతిరెడ్డిపాడు నుంచి తెలుగుగంగకు సాగునీరు కొంతమేర ఆలస్యంగా చేరుకున్నా, కేసీ కాలువకు వారం పది రోజుల్లో నీరు చేరే అవకాశం ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి నీటిని విడుదల చేస్తే బనకచర్ల, సంతజుటూరు, రాజోలు మీదుగా కడపకు పది రోజుల్లో చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచితే రెండుమూడు రోజుల్లో పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో చేస్తే కేసీ కెనాల్‌ రైతుల ఆశలు ఫలించే అవకాశం ఉంటుంది. కడప, కర్నూలు జిల్లాల్లో కూడా పెద్దగా వర్షాలు కురకపోవడంతో చెరువుల్లోకి నీరు రాకపోవడం, చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల్లో కూడా నీరు లేకపోవడంతో ఈసారి వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ గడువు ముగిసే పరిస్థితి ఏర్పడిరది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందిస్తే ఆయకట్టు రైతుల ఆశలు నెరవేరతాయి.
కేసీ కెనాల్‌ ఆయకట్టు 92 వేల ఎకరాలు
వైయస్సార్‌ జిల్లాలో కేసీ కెనాల్‌ కింద 92 వేల ఎకరాలు సాగు చేయాల్సి ఉంది. ఇప్పటికే చాలామంది రైతులు దుక్కులు చేసుకోగా, మరి కొందరు వర్షాలను చూసి దుక్కులు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు శ్రీశైలంలో నీరు చేరడంతో ఆలస్యంగానైనా ఖరీఫ్‌లో వరి సాగుకు సిద్ధమవుతున్నారు. శ్రీశైలంలో నీరు చేరడంతో తెలుగు గంగ రైతాంగం కూడా ఆశలు పెంచుకుంది. దీనికింద 1.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా నేరుగా ఆయకట్టుకు నీరిచ్చే పరిస్థితి లేకపోయినా చెరువులకు నీరు విడుదల చేయడం జరుగుతూ వస్తోంది. మరి ప్రభుత్వం ఎప్పటిలోగా నీరు విడుదల చేస్తుందో వేచిచూడాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img